“కన్న తండ్రినే పడుకోబెట్టి నకిలీ అంత్యక్రియలు నిర్వహిస్తున్న పిల్లాడి వింత కోరిక!”.. 7 ఏళ్ల బాలుడి వీడియోతో ఇంటర్నెట్‌లో ఆశ్చర్యం!

సాధారణంగా పిల్లలకు ఆటబొమ్మలు, కార్టూన్లు మరియు ఆటలపై ఆసక్తి ఉండటం సహజం. కానీ, చైనాకు చెందిన 7 ఏళ్ల బాలుడికి అంత్యక్రియల సంప్రదాయాలపై వింత ఆసక్తి ఏర్పడింది. కాగితంతో చిన్న శవపేటికలను తయారు చేసి, ఏకంగా తన తండ్రినే పడుకోబెట్టి నకిలీ అంత్యక్రియల ఆటలు ఆడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆ బాలుడి తల్లి ‘మా’ (Ma) తన కొడుకు చేస్తున్న ఈ విభిన్నమైన పనులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, ఈ వార్త ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

బాలుడికి 4 ఏళ్ల వయసున్నప్పుడు మొదటిసారి ఒక అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతే, అతనికి ఈ తరహా ఆసక్తి కలిగిందని చెబుతున్నారు. ఒకసారి నర్సరీ పాఠశాలలో చదువుతున్న ఆ బాలుడి డ్రాయింగ్ పుస్తకంలో సాధారణ బొమ్మలకు బదులుగా, అంత్యక్రియల్లో ఉంచే పూలమాలల బొమ్మలు ఎక్కువగా ఉండటాన్ని గమనించిన టీచర్, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఈ క్రమంలో ఖాళీ సమయాల్లో కాగితంతో అంత్యక్రియల సామాగ్రిని తయారు చేయడం, లెగో (Lego) ఆట బొమ్మలతో సంతాప సభల టెంట్లను ఏర్పాటు చేయడం అతనికి అలవాటుగా మారింది.

వీధి పక్కన ఆహార పదార్థాలు విక్రయించే తన తల్లి దుకాణం వద్దో లేదా పక్కన ఉన్న ఇతర దుకాణాల వద్దో కొన్నిసార్లు అతను నకిలీ అంత్యక్రియల సెటప్ వేసి ఆడుకుంటున్నప్పుడు, కుటుంబ సభ్యులకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.

అయినప్పటికీ, అతని ఈ పనుల పట్ల తల్లిదండ్రులు గానీ, తాతయ్య-నానమ్మలు గానీ ఆందోళన చెందకుండా, ప్రతి పిల్లాడికి ప్రత్యేకమైన ఆసక్తులు ఉంటాయని సహజంగానే తీసుకున్నారు. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు, పిల్లాడిని తిట్టకుండా అతని ఆసక్తిని గౌరవిస్తున్న తల్లిదండ్రుల తీరును ప్రశంసిస్తూనే, సరదాగా కామెంట్లు పెడుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *