ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో ఓ పాము చేపను వేటాడి మింగేస్తున్న దృశ్యం కెమెరాలో రికార్డయింది.
రిజర్వ్‌లోని బిజ్రానీ అటవీ ప్రాంతంలో నీటికి సమీపంలోని రాళ్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకృతి ఆహారపు గొలుసులో భాగంగా జరిగే ఈ అరుదైన దృశ్యం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రాళ్ల మధ్య నక్కి ఉన్న కీల్‌బ్యాక్ (Keelback) జాతికి చెందిన పాము, అకస్మాత్తుగా ఓ చేపను తన నోటితో గట్టిగా పట్టుకుంది. పాము పట్టు నుంచి తప్పించుకునేందుకు ఆ చేప తీవ్రంగా పోరాడింది. కానీ, పాము తన పట్టును ఏమాత్రం సడలించకుండా చేపను గట్టిగా ఒడిసిపట్టింది.
ఈ ఆసక్తికరమైన వేట దృశ్యాన్ని కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో గైడ్‌గా పనిచేస్తున్న బాబీ సింగ్ తన కెమెరాలో బంధించారు. చేపను పట్టుకున్న పాము, దాన్ని కొన్ని సెకన్లలోనే మింగేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.
అటవీ ప్రాంతాల్లో సహజంగా జరిగే ఇలాంటి వేట దృశ్యాలు చాలా అరుదుగా మాత్రమే కెమెరాకు చిక్కుతాయి. ఈ క్రమంలో రాళ్ల మధ్య దాక్కున్న పాము చేపను పట్టుకుని మింగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Leave a Reply