స్నేహితురాలిని నమ్మి పార్టీకి వెళ్లిన 17 ఏళ్ల బాలికపై దారుణం.. బలవంతంగా మద్యం తాగించి సామూహిక లైంగిక దాడి చేశారనే ఆరోపణలు!

మహారాష్ట్రలోని థానే జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలి ఆహ్వానంతో పార్టీకి వెళ్లిన 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో స్నేహితురాలితో సహా నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాషిగావ్ ప్రాంతానికి చెందిన బాలికను, ఆమెకు 25 ఏళ్ల స్నేహితురాలైన శీతల్ పార్టీకి రావాలని ఆహ్వానించింది. దీంతో బాలిక ఆమెతో కలిసి మీరా రోడ్‌లోని వినయ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి వెళ్లింది.

అక్కడ శీతల్ స్నేహితులైన పీయూష్, దుష్యంత్, ఆఘాత్ ఖాన్ కూడా ఉన్నారు. పార్టీ సమయంలో బాలికను బలవంతంగా మద్యం తాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం శీతల్, పీయూష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఆ సమయంలో ఆఘాత్ ఖాన్, దుష్యంత్ ఇద్దరూ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, తమ కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన బాలిక, తనకు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

బాలిక ఫిర్యాదు మేరకు కాషిగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శీతల్ సహా నలుగురి కోసం గాలిస్తున్నారు.

నిందితులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *