పనిచేసే చోట తోటి వారిని నమ్మి రాత్రి సమయ పార్టీలకు వెళ్లడం సాధారణంగా మారిన నేపథ్యంలో, నమ్మకద్రోహం మరియు మహిళలపై నేరాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా పనివేళలు ముగిసిన తర్వాత అక్రమంగా దుకాణాలు తెరిచి నిర్వహించే అర్ధరాత్రి పార్టీలు పలు సందర్భాల్లో ఊహించని ప్రమాదాలకు, నేరాలకు దారితీస్తున్నాయి.
ఢిల్లీలోని కర్కర్డూమా ప్రాంతంలో ఉన్న క్రాస్ రివర్ మాల్లో పనిచేస్తున్న ‘కేఫ్ 8’ (Cafe 8) రెస్టారెంట్‌కు చెందిన 22 ఏళ్ల యువతి, తనతో పాటు పనిచేసిన ఇద్దరు వ్యక్తులచే సామూహిక లైంగిక దాడికి గురైనట్లు ఫిర్యాదు చేసింది. సోమవారం రాత్రి ఆ యువతితో పాటు 8 మంది సహోద్యోగులు, ప్రీత్ విహార్ ప్రాంతంలోని ‘సల్తనత్ కేఫ్’ (Saltanate Cafe) అనే దుకాణాన్ని సాధారణ సమయమైన రాత్రి 11.30 గంటల తర్వాత కూడా తాళం చెవి ఉపయోగించి తెరిచి మద్యం పార్టీ నిర్వహించారు.
తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో పార్టీ ముగిసి బయటకు వచ్చిన క్రమంలో, అక్కడున్న సహోద్యోగుల సహకారంతో ఇద్దరు తనపై దారుణానికి పాల్పడ్డారని ఆ యువతి మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు.. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
కలిసి పనిచేసే వారే, అందులోనూ మహిళలే ఇటువంటి దారుణ చర్యకు సహకరించడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఉద్యోగం చేసే మహిళల భద్రతపై ఆందోళనను కలిగిస్తోంది. రాత్రి వేళల్లో కేఫ్‌లను అనుమతి లేకుండా తెరవకుండా పర్యవేక్షించడంలో యాజమాన్యాల నిర్లక్ష్యం, యువత బాధ్యతారాహిత్యం ఇటువంటి విషాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో, చట్టాలను మరింత కఠినతరం చేయాలన్న డిమాండ్ బలపడింది.

Leave a Reply