“ఇదేం మిస్టరీ.. 19 ఏళ్లకే ఇంతటి విషాదమా? ఓయో గదిలో విగతజీవిగా మారిన యూనివర్సిటీ విద్యార్థిని.. వెంట వచ్చిన ప్రియుడు పరారీ.. లేఖలో ఏం రాసి ఉంది?”

హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ఓ ఓయో (OYO) హోటల్ గదిలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని అర్చన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖురేషీపూర్, గాంధీ కాలనీకి చెందిన అర్చన తన ప్రియుడితో కలిసి హోటల్‌కు వచ్చినట్లు సమాచారం. విద్యార్థిని మృతదేహం వద్ద సూసైడ్ నోట్‌తో పాటు ఎలుకల మందు ఉన్న ఖాళీ ప్యాకెట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అర్చన సోమవారం ఉదయం కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె, ఆ తర్వాత అందుబాటులోకి రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో మరుసటి రోజు హోటల్ గదిలో విద్యార్థిని విగతజీవిగా పడి ఉందన్న సమాచారం కుటుంబ సభ్యులకు అందింది.

హోటల్ గదిలో విద్యార్థిని మృతదేహం పక్కన విషపు మందు ప్యాకెట్, ఒక లేఖ లభ్యమయ్యాయి. దీంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా లేక ఆమెకు మరేదైనా హాని జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ లేఖను విద్యార్థినే రాసిందా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు చేతిరాత నిపుణుల పరిశీలనకు పంపాలని యోచిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బీకే (BK) ఆసుపత్రికి తరలించారు.

కాగా, అర్చనతో పాటు ఆమె పొరుగింట్లో నివసించే విపిన్ యాదవ్ అనే యువకుడు హోటల్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత అతడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థిని చివరి సెల్‌ఫోన్ లొకేషన్, హోటల్ రిజిస్టర్‌లో నమోదైన వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. విద్యార్థిని మరణానికి అసలు కారణం ఏమిటి, లేఖలో ఏం రాసి ఉంది, వెంట వచ్చిన యువకుడికి ఇందులో ఏమైనా ప్రమేయం ఉందా అన్నది విచారణ పూర్తయితేనే తేలనుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *