“ఒక్కరు కూడా అర్ధశతకం చేయలేదే.. ఓటమికి తిలక్ వర్మ మాత్రమే కారణమా..!” మహ్మద్ కైఫ్ సంధించిన ఆ ప్రశ్న.. అభిమానుల మధ్య మొదలైన చర్చ..!!

తిలక్ వర్మ బ్యాటింగ్ తీరుపై భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తిలక్ వర్మ రెండు వైపులా పదునున్న కత్తి లాంటి వాడని పేర్కొన్న కైఫ్, అతను నిదానంగా ఆడి జట్టు ఓడిపోయినప్పుడు ఎప్పుడూ అతనిపైనే నింద పడుతుందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, చివరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు ఆశలు కల్పించిన అతని ప్రయత్నానికి తాను పూర్తి మార్కులు వేస్తానని, జట్టు ఓడిపోవడం వల్ల అది ఒక మరుపురాని సెంచరీగా నిలవలేకపోయిందని ఆయన తెలిపారు.

అంతేకాకుండా, ఈ ఓటమికి తిలక్ వర్మను మాత్రమే ఎక్కువగా తప్పుబట్టనని చెప్పిన మహ్మద్ కైఫ్, మిగతా బ్యాటర్లు కూడా పరుగులు చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు.

ఇతర ఆటగాళ్లలో ఎవరైనా ఒక్కరు అర్ధశతకం సాధించి ఉన్నా జట్టు విజయం సాధించేదని, తిలక్ వర్మ ఎప్పుడూ ఇదే శైలిలో ఆడి చివర్లో మ్యాచ్‌ను విజయవంతంగా ముగిస్తాడని, కానీ ఈసారి అది జరగలేదని కైఫ్ వివరించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *