మొదట వరకట్న వేధింపుల కేసు.. ఆ తర్వాత కేసు ఉపసంహరణకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి బెదిరింపులు! నకిలీ ఫొటోలతో భర్త పరువు తీసే ప్రయత్నం.. భార్య, మామను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భార్యాభర్తల మధ్య మొదలైన వివాదం.. చివరకు బెదిరింపులు, డబ్బు డిమాండ్ చేసే స్థాయికి చేరినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

విజయవర్గీయ అనే వ్యక్తి 2023లో యశస్వి విజయవర్గీయను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది కాలానికే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో భర్తపై వరకట్న వేధింపుల ఆరోపణలు చేస్తూ యశస్వి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే మరో వివాదం తెరపైకి వచ్చింది.

తన భార్య ఇప్పటికే తన నుంచి రూ.15 లక్షలు తీసుకుందని, ఇప్పుడు వరకట్న వేధింపుల కేసును ఉపసంహరించుకుని ముగించేందుకు మరో రూ.50 లక్షలు డిమాండ్ చేస్తోందని భర్త వకుల్ విజయవర్గీయ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ డబ్బు డిమాండ్‌లో తన భార్య యశస్వి విజయవర్గీయతో పాటు ఆమె తండ్రి సంజయ్ విజయవర్గీయ కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు.

అంతేకాదు, ఓ మహిళా స్నేహితురాలితో తాను ఉన్నట్లు చూపించే ఫొటోను నకిలీగా రూపొందించి, తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. భార్య యశస్వి విజయవర్గీయ, మామ సంజయ్ విజయవర్గీయలపై బెదిరింపులు, డబ్బు వసూలు ఆరోపణలతో కేసు నమోదు చేసి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

రూ.15 లక్షల చెల్లింపుల వ్యవహారం, రూ.50 లక్షల డిమాండ్, సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు చెబుతున్న ఫొటో, గతంలో నమోదైన వరకట్న వేధింపుల కేసు.. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *