రేషన్ బియ్యం సమస్య పరిష్కారానికి కేరళ ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరిస్తుంది. తమకు బియ్యం అవసరం లేకపోయినా రేషన్ కార్డు ఉంచుకుంటున్నటువంటి కుటుంబాల వివరాలను కేరళ ప్రభుత్వం సేకరించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది తమ పిల్లలకు… ఫీజ్ రియంబర్స్మెంట్ రాదేమో.. తమకు ఆరోగ్యశ్రీ వర్తించదేమో అలాంటి కారణాల వల్లనే.. తెల్ల రేషన్ కార్డుని కొనసాగిస్తున్నారు. .ఆరోగ్యశ్రీ.. రెండు ఫీజ్ రియంబర్స్మెంట్.. ఈ రెండు పథకాలకు తెల్ల రేషన్ కార్డు తో సంబంధం లేకుండా వేరు చేయగలిగితే చాలా మంది రేషన్ బియ్యాన్ని వదిలేసుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నది నిపుణుల మాట…
దీనికే కేరళలో నాలుగు రకాల రేషన్ కార్డుల విధానాన్ని అమలు చేస్తున్నారు.. తెలుపు… పసుపు.. గులాబీ.. నీలం.. నాలుగు రంగుల్లో అక్కడ రేషన్ కార్డులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెండే రంగుల్లో రేషన్ కార్డులు అందిస్తున్నారు. ఒకటి తెల్ల రేషన్ కార్డు అలాంటిది .మొత్తం కోటి 68 లక్షల మందిలో ఒక కోటి 48 లక్షల మంది తెల్ల రేషన్ కార్డు దారులే ఉన్నారు. అంటే బిపిఎల్ పేదల కింద లెక్కేస్తే ఆంధ్రప్రదేశ్ లో సగటున కుటుంబానికి నలుగురు లెక్కేస్తే… సుమారుగా ఐదున్నర కోట్ల మంది వరకు ఆంధ్రప్రదేశ్ లో పేదలే ఉన్నారని అధికారిక రేషన్ షాపుల లెక్కలు చెబుతున్నాయి.
ఇలాంటి సమస్య పరిష్కారం కోసం కేరళ అనుసరిస్తున్నటువంటి విధానంలో లక్ష రూపాయల లోపు ఏడాదికి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు.. లక్ష నుంచి రెండు లక్షలు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి పసుపు రేషన్ కార్డు.. రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి గులాబీ రేషన్ కార్డు.. ఆ పైన ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి నీలం కలర్ రేషన్ కార్డుని కేరళ ప్రభుత్వం అందిస్తుంది..
దాని ద్వారా లక్ష రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి ఉచితంగా రేషన్ బియ్యం అందుతాయి.. రెండు లక్షలు మూడు లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇతర ప్రభుత్వ పథకాలన్నీ వారి ఆర్థిక పరిస్థితిని బట్టి అందించే రీతిలో అక్కడ ప్రభుత్వం నిర్దిష్టమైన కొలమానాలను పెట్టుకుంది.. ఇది కేరళలో విజయవంతంగా సాగుతుంది.. అక్కడ రేషన్ మాఫియా సాగడానికి ఆస్కారం కనిపించట్లేదు.. అదే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రేషన్ మాఫియా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుంది.
కేరళ మాత్రం తాము చేసిన ప్రయోగంతో రేషన్ బియ్యం ఎవరికి అవసరమో వారికి మాత్రమే అందించే విధానాన్ని అనుసరిస్తూ.. ఏ కుటుంబానికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు అవసరమో వారికి అవి అందిస్తూ ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చింది..రళలో రేషన్ షాపుల ద్వారా 16 రకాల సరుకులు కిరాణ ప్రతి ఇంటికి అవసరమైనటువంటి నెలవారి సరుకుల్ని… చాలా చౌకదారులకు అందించేటువంటి విధానాన్ని సమర్ధవంతంగా అనుసరిస్తుంది.. .