మైక్రోసాఫ్ట్ సంస్థలో గత 24 ఏళ్లుగా పనిచేస్తున్న లారా విలియమ్స్ అనే మహిళా ఉద్యోగి, ఇంజనీరింగ్ బృందానికి కృత్రిమ మేధస్సు (AI) గురించి 90 నిమిషాల శిక్షణ ఇస్తుండగా అకస్మాత్తుగా ఉద్యోగం నుండి తొలగించబడ్డారు.
ఏఐ (AI) టూల్స్ ద్వారా సాంకేతిక పత్రాలను (Technical Documents) ఎలా రూపొందించాలో ఆమె సహోద్యోగులకు వివరిస్తున్న సమయంలో, మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్‌లో ‘హై ప్రయారిటీ బిజినెస్ అప్డేట్’ (High Priority Business Update) పేరుతో వచ్చిన మీటింగ్ ఆహ్వానం ద్వారా, కొన్ని నిమిషాల్లోనే ఆమె 24 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానానికి తెరపడింది.
ఉద్యోగం కోల్పోయినప్పటికీ, మైక్రోసాఫ్ట్ సంస్థలో 24 సంవత్సరాలు కొనసాగడానికి అక్కడి సహోద్యోగులు మరియు మేనేజర్లతో ఉన్న అనుబంధమే ప్రధాన కారణమని లారా తన లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, మైక్రోసాப்ட் ఇన్‌ట్యూన్ (Intune) మరియు పర్వ్యూ (Purview) డాక్యుమెంటేషన్ బృందంతో కలిసి పనిచేయడాన్ని తన కెరీర్లోనే అతిపెద్ద విజయాలలో ఒకటిగా ఆమె పేర్కొన్నారు.
టెక్నాలజీ కంపెనీలు తమ కార్యకలాపాలలో ఏఐ వినియోగాన్ని వేగంగా పెంచుతున్న తరుణంలో, ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తుండగానే లారాకు తొలగింపు సమాచారం రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయినప్పటికీ, కేవలం ఏఐ సాంకేతికత వల్లే ఆమె ఉద్యోగం పోయిందనడానికి ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, 24 ఏళ్ల కష్టానికి ఫలితంగా ఇలాంటి ఘటన జరగడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Leave a Reply