CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026 నుండి అమల్లోకి రానున్న పదవ తరగతి పరీక్షల కొత్త విధానంపై అధికారిక స్పష్టత ఇచ్చింది. వైద్యపరమైన లేదా వ్యక్తిగత కారణాల వల్ల మొదటి పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థులు, నేరుగా రెండో పరీక్ష రాయవచ్చా అనే సందేహాలకు బోర్డు చెక్ పెట్టింది.
మొదటి పరీక్షకు హాజరు తప్పనిసరి: బోర్డు నిబంధనల ప్రకారం, విద్యార్థులందరూ కచ్చితంగా మొదటి బోర్డు పరీక్షకు హాజరు కావాలి. ఒకవేళ ఎవరైనా విద్యార్థి మొదటి పరీక్షలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాయకపోతే, వారు రెండో పరీక్ష రాయడానికి అనర్హులు (Ineligible). అలాంటి విద్యార్థులను ‘Essential Repeat’ కేటగిరీలో ఉంచుతారు. అంటే వారు మళ్ళీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ప్రధాన పరీక్షలకు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది.
రెండో పరీక్ష (Second Exam) ఎవరి కోసం? ఈ రెండో అవకాశం కేవలం ఈ క్రింది కేటగిరీల విద్యార్థులకు మాత్రమే ఉంటుంది:
- ఇంప్రూవ్మెంట్ (Improvement): మొదటి పరీక్షలో పాస్ అయిన విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి (గరిష్టంగా మూడు ప్రధాన సబ్జెక్టులలో) రెండో పరీక్ష రాయవచ్చు.
- కంపార్ట్మెంట్ (Compartment): మొదటి పరీక్షలో ఫెయిల్ అయ్యి కంపార్ట్మెంట్ వచ్చిన వారు.
- రిప్లేస్మెంట్ సబ్జెక్ట్: పాస్ అయినప్పటికీ ఏదైనా ఒక సబ్జెక్టును మార్చుకుని మెరుగుపరుచుకోవాలనుకునే వారు.
అదనపు సబ్జెక్టులపై నిషేధం: పదో తరగతి పాస్ అయిన తర్వాత కొత్తగా అదనపు సబ్జెక్టులు (Extra Subjects) జోడించడానికి రెండో పరీక్షలో అవకాశం ఉండదు. కేవలం ఇంప్రూవ్మెంట్ లేదా కంపార్ట్మెంట్ విద్యార్థులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.
