IND vs ZIM: నాకు ఒక్క ఓవర్ ఇవ్వలేదు.. పూర్తి కోటా వేసేలా చేస్తా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ సంచలన వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో జింబాబ్వే జట్టును 72 పరుగుల తేడాతో ఓడించి, టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అంతేకాకుండా, బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

హార్దిక్ పాండ్యా స్పందన: “నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. 23 బంతుల్లో 50 పరుగులు చేశానంటే కొంచెం వింతగా ఉంది. కానీ నేను ఆడేటప్పుడు బంతిని బట్టి, మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆడాను. నేను బంతిని బలంగా బాదగలనని నాకు తెలుసు. సిక్సర్లు కొట్టడం నాకు సులభం, అందుకే నా శైలిని కొనసాగించాలనుకున్నాను.

గత కొన్ని మ్యాచ్‌లలో నేను అనుకున్నది చేయలేకపోయాను. అందుకే ఈరోజు బ్యాటింగ్‌లో రాణించడం సంతృప్తిని ఇచ్చింది. ఈ టోర్నీలో మనం ఎప్పుడూ అత్యుత్తమ క్రికెట్ ఆడాలి. మన నైపుణ్యాలను నమ్ముకోవాలి. ఒత్తిడిని తట్టుకుని నిలబడాలి. ఒక మ్యాచ్ ముగియగానే వెంటనే తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి.

నేను బౌలింగ్‌పై కూడా దృష్టి సారిస్తున్నాను. ఈరోజు బాగా బౌలింగ్ చేశానని అనుకుంటున్నాను. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. నేను బంతిని బాగా స్వింగ్ చేస్తున్నాను. నాకు లభించే అవకాశాల పట్ల సంతోషంగా ఉన్నాను. నా బౌలింగ్‌తో వికెట్లు తీయగలను, బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలను. అయితే, నాకు ఇంకా ఒక ఓవర్ (కోటాలో) మిగిలిపోయింది, దాన్ని కూడా వేసే స్థాయికి చేరుకుంటాను” అని హార్దిక్ పాండ్యా అన్నాడు.


Posted

in

by

Tags: