కొత్త ఐఫోన్ 18 (iPhone 18) కొనలేకపోయినా సరే.. దాని ప్రీమియం స్టైలిష్ కెమెరా లుక్‌ను AI టెక్నాలజీ ద్వారా మన ఫొటోలకు తీసుకురావచ్చనే సరికొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మీ దగ్గరున్న పాత లేదా సాధారణ ఫొటోను ఏదైనా AI ఇమేజ్ టూల్లో అప్లోడ్ చేసి, నిర్దిష్ట ప్రాంప్ట్‌లను (కమాండ్స్) ఉపయోగించడం ద్వారా లగ్జరీ పోర్ట్రెయిట్, అధునాతన నగర నేపథ్యం, ట్రావెల్ లుక్ వంటి విభిన్నమైన అద్భుతమైన ఫొటోలను రూపొందించుకోవచ్చు.
దీనికోసం మొదట మంచి వెలుతురులో దిగిన స్పష్టమైన ఫొటోను ఎంచుకోవడం ఉత్తమం. ఆ తర్వాత AIకి మీ ముఖ లక్షణాలు, సహజమైన చర్మపు రంగు, ముఖ కవళికలు ఏమాత్రం మారకుండా.. దుస్తులు, నేపథ్యం (బ్యాక్‌గ్రౌండ్), లైటింగ్ మరియు ఫొటో నాణ్యతను మాత్రమే మార్చాలని ప్రాంప్ట్ ఇవ్వాలి. కేవలం “ఫొటోను అందంగా మార్చు” అనే సాధారణ ఆదేశాల కంటే, ఇలాంటి ఖచ్చితమైన ప్రాంప్ట్‌లు ఇవ్వడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తాయి.
- ప్రాంప్ట్ 1: “నా ముఖ కవళికలు, చర్మపు సహజ రంగు ఏమాత్రం మారకుండా.. హై-ఎండ్ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ కెమెరాలో తీసిన ప్రీమియం పోర్ట్రెయిట్ ఫొటోలా మార్చు. మృదువైన వెలుతురు (సాఫ్ట్ లైటింగ్), సహజమైన బ్యాక్‌గ్రౌండ్ బ్లర్, స్పష్టమైన ఫేస్ డిటెయిల్స్, అత్యున్నత స్థాయి ఫొటో క్వాలిటీ ఉండాలి.”
- ప్రాంప్ట్ 2: “నా ఫొటోను అత్యాధునిక నగరపు లగ్జరీ వాతావరణంలో తీసిన స్టైలిష్ ఫొటోగా మార్చు. ముఖ రూపం మారకూడదు. ప్రీమియం దుస్తులు, అందమైన రాత్రి వెలుగులు (నైట్ సిటీ లైట్స్), సహజమైన స్కిన్ టోన్, సినిమాటిక్ నాణ్యతతో కూడిన ఫొటో లుక్ ఉండాలి.”
- ప్రాంప్ట్ 3: “నా ఫొటోను విదేశాల్లోని విలాసవంతమైన పర్యాటక ప్రాంతంలో తీసిన ఫొటోగా మార్చు. ముఖం, హావభావాలు యథాతథంగా ఉండాలి. సహజమైన సూర్యకాంతి, స్పష్టమైన నేపథ్యం, ప్రీమియం ట్రావెల్ డ్రెస్, హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ కెమెరా లుక్ రావాలి.”
ఈ AI ఫొటో ట్రెండ్‌లో కేవలం సాధారణ ఫిల్టర్లను వాడటం కంటే.. దుస్తులు, లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్, కెమెరా నాణ్యత వంటి వివరాలను స్పష్టంగా పేర్కొనడం చాలా ముఖ్యం. అదేవిధంగా AI రూపొందించిన చిత్రంలో ముఖం లేదా చేతుల వేళ్లలో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్నది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ముందే సరిచూసుకోవడం మంచిది.
