వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు సంబంధించి వినియోగదారులు ఇకపై కాస్త అప్రమత్తంగా ఉండాలి. గతంలో లాగా పగటి సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ తీసి గ్యాస్ బుక్ చేయడం ఇక కుదరదు. గ్యాస్ ఏజెన్సీలు బుకింగ్ కోసం ఒక ప్రత్యేక టైమ్-టేబుల్‌ను అమలులోకి తెచ్చాయి. దీనిని పాటించకపోతే మీ బుకింగ్ అంగీకరించబడదు.
సమయం చూసి బుక్ చేసుకోవాలి: కొత్త నిబంధనల ప్రకారం, బుకింగ్ విండో ఇకపై 24 గంటలు తెరిచి ఉండదు. మీరు సిలిండర్ బుక్ చేసుకోవాలంటే కేవలం ఉదయం 5 గంటల నుండి 7 గంటల మధ్య లేదా రాత్రి 8 గంటల నుండి 12 గంటల మధ్య మాత్రమే కాల్ లేదా మెసేజ్ చేయాలి. ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు (దాదాపు 13 గంటల పాటు) బుకింగ్ సౌకర్యం పూర్తిగా నిలిపివేయబడుతుంది.
25 రోజుల నిబంధన: సమయంతో పాటు మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే.. మీరు పాత సిలిండర్ డెలివరీ తీసుకున్న తర్వాత కనీసం 25 రోజులు గడిస్తేనే కొత్త బుకింగ్ అంగీకరించబడుతుంది. అంతకంటే ముందే బుక్ చేయడానికి ప్రయత్నిస్తే సిస్టమ్ దానిని తిరస్కరిస్తుంది (Reject).
డిజిటల్ పద్ధతిలో బుకింగ్: వివిధ కంపెనీలు వాట్సాప్ మరియు SMS ద్వారా బుకింగ్‌ను సులభతరం చేశాయి:
- భారత్ గ్యాస్: 1800224344 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని పంపండి.
- ఇండేన్ గ్యాస్: 75888-88824 నంబర్‌కు ‘REFILL’ అని మెసేజ్ చేయండి.
- HP గ్యాస్: 92222-01122 నంబర్‌కు ‘Book’ అని మెసేజ్ చేయండి.
ఇంటర్నెట్ లేకుండా మిస్డ్ కాల్ సౌకర్యం:
- భారత్ గ్యాస్: 77180-12345
- ఇండేన్: 84549-55555
- HP గ్యాస్: 949360-22222
ఫిర్యాదుల కోసం: సిలిండర్ డెలివరీలో సమస్యలు ఉంటే ఇండేన్/HP వినియోగదారులు 18002333555 నంబర్‌కు, భారత్ గ్యాస్ వినియోగదారులు 1800224344 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
