సంఖ్యాశాస్త్రం: అంకె జ్యోతిష్యంలో పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరంతో పాటు వ్యక్తి ఉపయోగించే మొబైల్ నంబర్‌కు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మీరు వాడుతున్న మొబైల్ నంబర్ చివరి అంకె మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.
ఇది మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. మొబైల్ చివరి అంకెకు, అదృష్టానికి గట్టి సంబంధం ఉంటుంది. 0 నుండి 9 వరకు ప్రతి అంకెకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. మొబైల్ చివరి నంబర్ యొక్క ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
మొబైల్ నంబర్ చివరి అంకె ‘1’ అయితే: మీ ఫోన్ నంబర్ చివర 1 ఉంటే, ఇతరులతో పోలిస్తే మీకు ఫోన్ కాల్స్ తక్కువగా వస్తాయి. ఇలాంటి వారికి ఎక్కువగా కెరీర్ లేదా పనికి సంబంధించిన కాల్స్ మాత్రమే వస్తాయి. వీరు నాయకత్వ లక్షణాలు (Leader qualities) కలిగి ఉంటారు.
మొబైల్ నంబర్ చివరి అంకె ‘2’ అయితే: ఎవరి ఫోన్ నంబర్ చివర 2 ఉంటుందో, వారు చాలా సున్నిత మనస్కులు మరియు సహకరించే స్వభావం కలవారు. వీరికి సంబంధాలను (Relationships) సమతుల్యంగా ఉంచుకునే నైపుణ్యం ఉంటుంది.
మొబైల్ నంబర్ చివరి అంకె ‘3’ అయితే: నెంబర్ చివర 3 ఉన్నవారు ఉత్సాహంగా ఉంటారు మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో కళాత్మక లేదా రచనా నైపుణ్యం ఉంటుంది. వీరు తరచుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మొబైల్ నంబర్ చివరి అంకె ‘4’ అయితే: చివరి అంకె 4 ఉన్నవారు కష్టపడి పనిచేసే స్వభావం కలవారు. వీరు ఏ పనినైనా నిలకడగా, నిదానంగా పూర్తి చేస్తారు తప్ప తొందరపాటు ప్రదర్శించరు.
మొబైల్ నంబర్ చివరి అంకె ‘5’ అయితే: నెంబర్ చివర 5 ఉన్నవారు రిస్క్ తీసుకునే ధైర్యం కలవారు. వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణాలు చేయడం మరియు కొత్త విషయాలను నేర్చుకోవడం వీరికి చాలా ఇష్టం.
మొబైల్ నంబర్ చివరి అంకె ‘6’ అయితే: చివర 6 ఉన్నవారు కుటుంబం మరియు భాగస్వామి పట్ల బాధ్యతగా ఉంటారు. వీరు సంబంధాలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారు మరియు ఎప్పుడూ ఇతరుల క్షేమం గురించి ఆలోచిస్తారు.
మొబైల్ నంబర్ చివరి అంకె ‘7’ అయితే: ఫోన్ నంబర్ చివర 7 ఉండటం చాలా మంచిది. వీరు లోతైన ఆలోచనాపరులు మరియు జ్ఞానులు. జీవిత సత్యాలను తెలుసుకోవడానికి వీరు ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు మరియు ఆ పంథాలోనే జీవితంలో ముందుకు సాగుతారు.
మొబైల్ నంబర్ చివరి అంకె ‘8’ అయితే: చివరి అంకె 8 ఉన్నవారు ఆర్థికంగా నిలకడగా ఉంటారు. వీరి ఆదాయ మార్గాలు బాగుంటాయి. తమ తెలివితేటలతో వ్యాపారాన్ని (Business) ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు.
మొబైల్ నంబర్ చివరి అంకె ‘9’ అయితే: నెంబర్ చివర 9 ఉండటం అనేది సేవానిరతిని సూచిస్తుంది. వీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తులు.
మొబైల్ నంబర్ చివరి అంకె ‘0’ అయితే: ఫోన్ నంబర్ చివర సున్నా (0) ఉండటం అంత శుభప్రదంగా భావించరు. దీని అర్థం మీ పనులు త్వరగా పూర్తికాకపోవచ్చు. మీకు ఫోన్ కాల్స్ వస్తాయి కానీ ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. అయితే వీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు.
