Psychology: మీ ప్రవర్తన మరియు వ్యక్తిత్వం ద్వారా గౌరవం సంపాదించాలనుకుంటున్నారా? ఈ 10 రహస్యాలను నేర్చుకోండి.

1. ఇతరుల ఎనర్జీతో కలవండి (Matching Energy): కొందరు వ్యక్తులు నీటి లాంటి వారు, ఎక్కడికి వెళ్లినా అక్కడ ఉన్న వారితో ఇట్టే కలిసిపోతారు. ఇతరుల ఉత్సాహానికి లేదా భావోద్వేగానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మల్చుకోవడం వల్ల వారిలో మీపై నమ్మకం పెరుగుతుంది. ఇది గౌరవాన్ని పెంచడమే కాకుండా మిమ్మల్ని ఒక లీడర్‌గా చూసేలా చేస్తుంది.

2. రెడీమేడ్ సమాధానాలు ఇవ్వకండి (Let them find answers): ప్రజలు తమను తెలివైన వారుగా గుర్తించే వారినే ఇష్టపడతారు. ఎవరైనా సమస్యతో వస్తే వెంటనే సలహాలు ఇచ్చేయకుండా, వారినే ఆలోచించనివ్వండి. వారు సమాధానాలు వెతుక్కునేలా ప్రోత్సహించడం వల్ల మీపై గౌరవం పెరుగుతుంది.

3. చిన్న విషయాలను గుర్తుంచుకోండి (Remember small details): పెద్ద విషయాలు అందరూ గుర్తుంచుకుంటారు. కానీ ఒక వ్యక్తి యొక్క చిన్న కల, ఇష్టం లేదా గతంలో వారు చెప్పిన చిన్న విషయాన్ని మీరు గుర్తుంచుకుని అడిగితే, వారికి మీపై చెప్పలేనంత గౌరవం కలుగుతుంది. మీరు వారిపై శ్రద్ధ వహిస్తున్నారని ఇది నిరూపిస్తుంది.

4. మౌనంగా వినడం అలవాటు చేసుకోండి (The Power of Silence): ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినేవారికి సంఘంలో ప్రత్యేక గౌరవం ఉంటుంది. వారు మాట్లాడటం ముగించిన తర్వాత ఒక క్షణం ఆలోచించి సమాధానం చెప్పండి. ఈ చిన్న మౌనం మీరు చెప్పే మాటకు ఎంతో బరువును (Weight) ఇస్తుంది.

5. ఇతరుల కృషిని గుర్తించండి (Highlighting Others): స్వార్థపరులు ఎప్పుడూ తామే హైలైట్ అవ్వాలనుకుంటారు. కానీ గొప్ప మనసున్న వారు తమతో పాటు ఇతరుల కృషిని కూడా గుర్తిస్తారు. ఇతరులకు క్రెడిట్ ఇచ్చే గుణం ఉన్నవారికి గౌరవం దానంతట అదే వస్తుంది.

6. మానవత్వంతో ఉండండి (Being Human): ప్రతి విషయాన్ని డబ్బుతో లేదా పనితోనే కొలవలేము. తెలివితేటలతో పాటు హృదయంతో కూడా ఆలోచించే వ్యక్తులను జనం ఎక్కువగా నమ్ముతారు. మీలోని మానవత్వం మిమ్మల్ని అందరికీ ఆత్మీయులను చేస్తుంది.

7. ఎప్పుడూ అందుబాటులో ఉండకండి (Be Unpredictable): సోషల్ మీడియాలో ప్రతి నిమిషం కనిపించడం, మెసేజ్ రాగానే వెంటనే రిప్లై ఇవ్వడం వల్ల మీ విలువ తగ్గవచ్చు. కొంచెం అరుదుగా, అంచనాలకు అందకుండా ఉండటం వల్ల మీపై ఇతరులకు ఆసక్తి మరియు గౌరవం పెరుగుతాయి.

8. చర్చ పీక్స్‌లో ఉన్నప్పుడే ముగించండి (Know when to stop): మాటలు చాలా బాగున్నాయి కదా అని సాగదీయకండి. చర్చ ఆసక్తికరంగా ఉన్నప్పుడే దానికి ముగింపు పలకడం నేర్చుకోండి. దీనివల్ల “వారు ఇంకా కొంచెం సేపు మాట్లాడితే బాగుండు” అనే ఫీలింగ్ ఇతరుల్లో కలుగుతుంది.

9. ఇబ్బందికర క్షణాలను ధైర్యంగా ఎదుర్కోండి: నిశ్శబ్దం ఏర్పడినప్పుడు కంగారు పడి ఏవేవో మాట్లాడకండి. ఆ మౌనాన్ని కూడా ప్రశాంతంగా ఆస్వాదించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని (Self-confidence) సూచిస్తుంది.

10. భిన్న అభిప్రాయాలను గౌరవించండి (Encourage different opinions): మీకు తలాడించే వారినే కాకుండా, మిమ్మల్ని విమర్శించే వారిని కూడా దగ్గరకు తీయండి. భిన్నమైన ఆలోచనలను స్వీకరించడం వల్ల మీరు ఎంత పరిణతి చెందిన వ్యక్తో అర్థమవుతుంది. ఇది మీపై ఇతరులకు ఉన్న నమ్మకాన్ని బలపరుస్తుంది.


Posted

in

by

Tags: