వేసవి ఎండలకు మిద్దె (టెర్రస్) విపరీతంగా వేడెక్కుతుంది. దీనివల్ల రాత్రి సమయాల్లో ఇంట్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అయితే, మీ ఇంటి మిద్దెను చల్లగా మార్చడానికి కొన్ని అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో వివరంగా చూద్దాం.
వేసవి కాలం వస్తే చాలు ఇల్లు సెగలు కక్కుతుంది. ఏసీలు, కూలర్లు వేసినా వేడి తగ్గదు. దీనికి ప్రధాన కారణం ఇంటి పైకప్పు. ఎండ నేరుగా మిద్దెపై పడటం వల్ల ఆ వేడి లోపలికి దిగుతుంది. ఈ ఎండ తీవ్రత నుండి తప్పించుకోవడానికి ఈ క్రింది పద్ధతులు పాటిస్తే సరిపోతుంది.
రూఫ్ కూలింగ్ వల్ల కలిగే ఉపయోగాలు: మిద్దెను చల్లబరచడం (రూఫ్ కూలింగ్) అనేది ఒక తెలివైన పరిష్కారం. ఇది ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా, విద్యుత్ వాడకాన్ని కూడా భారీగా తగ్గిస్తుంది.
- కరెంటు బిల్లు ఆదా: ఏసీ, కూలర్, ఫ్యాన్ల వాడకం తగ్గి నెలవారీ విద్యుత్ బిల్లు తగ్గుతుంది.
- సౌకర్యం: వేసవిలో కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉండవచ్చు.
- పైకప్పు రక్షణ: ఎండ వేడి వల్ల పైకప్పుపై పగుళ్లు రాకుండా కాపాడుతుంది, తద్వారా ఇల్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
అనుసరించాల్సిన పద్ధతులు:
- వైట్ పెయింట్ లేదా కూల్ రూఫ్ పెయింట్: ఇది తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి. మిద్దెపై తెల్లటి రంగు లేదా ప్రత్యేకమైన ‘కool రూఫ్ పెయింట్’ వేస్తే, 80 శాతం కంటే ఎక్కువ ఎండ వేడి నేరుగా ఇంటి లోపలికి రాదు.
- కూల్ రూఫ్ టైల్స్: సాధారణ టైల్స్ లేదా కాంక్రీటుకు బదులుగా, వేడిని గ్రహించని ప్రత్యేకమైన కూల్ రూఫ్ టైల్స్ లేదా ఇటుకలను పైకప్పుపై అమర్చవచ్చు.
- టెర్రస్ గార్డెన్: మిద్దెపై మొక్కలు పెంచడం లేదా చిన్నపాటి తోటను ఏర్పాటు చేయడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. ఇది వేడిని అడ్డుకోవడమే కాకుండా, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.
- థర్మల్ ఇన్సులేషన్: థర్మాకోల్, పాలియురేథేన్ ఫోమ్ లేదా ప్రత్యేక ఇన్సులేషన్ బోర్డులను ఉపయోగించడం ద్వారా వేడి ఇంటి లోపలికి చొచ్చుకురాకుండా అడ్డుకోవచ్చు.
