RR vs SRH: వైభవ్ సూర్యవంశీ గాయంపై అప్‌డేట్; టోర్నీ నుండి వైదొలుగుతారా? అసలు నిజం చెప్పిన ఆర్‌ఆర్ బ్యాటింగ్ కోచ్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా గాయపడ్డారు. నొప్పితో విలవిలలాడుతూ ఆయన మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఇషాన్ కిషన్ భారీ షాట్ ఆడినప్పుడు ఈ ఘటన జరిగింది. బంతి వేగంగా బౌండరీ వైపు దూసుకెళ్తుండగా, దాన్ని ఆపే క్రమంలో వైభవ్ వేగంగా పరుగెత్తారు. ఆ సమయంలో ఆయన హ్యామ్‌స్ట్రింగ్‌ (Hamstring) పట్టేయడంతో వెంటనే మైదానంలో కుప్పకూలిపోయారు. టీమ్ సపోర్ట్ స్టాఫ్ సాయంతో ఆయనను బయటకు తీసుకెళ్లారు.

వైభవ్ గాయంపై కోచ్ వివరణ: ఆర్‌ఆర్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వైభవ్ గాయంపై స్పందిస్తూ.. “అతనికి హ్యామ్‌స్ట్రింగ్‌లో కొంచెం అసౌకర్యంగా అనిపించింది, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాడు. ప్రాథమిక చికిత్స అందించాం. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సినంత తీవ్రమైనది ఏమీ అనిపించడం లేదు” అని తెలిపారు.

అయితే, గతంలో సీఎస్‌కే ప్లేయర్ ఆయుష్ మ्हाత్రే కూడా ఇలాగే హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఐపీఎల్ 2026 నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో వైభవ్ స్కాన్ రిపోర్టుల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

రికార్డుల వీరుడు వైభవ్ సూర్యవంశీ: కేవలం 15 ఏళ్ల వయస్సున్న వైభవ్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. 103 పరుగుల ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఆయన 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం ఇది మూడోసారి. అంతేకాకుండా, టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా వైభవ్ రికార్డుకెక్కాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు:

  • క్రిస్ గేల్ (2013): 30 బంతులు
  • వైభవ్ సూర్యవంశీ (2025): 35 బంతులు
  • వైభవ్ సూర్యవంశీ (2026): 36 బంతులు

Posted

in

by

Tags: