“S.I.R వివాదంలో సుప్రీంకోర్టు సంచలనం” ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు నోటీసులు.. ఉలిక్కిపడ్డ ఎన్నికల సంఘం..!!

ఓటర్ల జాబితాలో చేపట్టే ప్రత్యేక సవరణ చర్యల (S.I.R) మరియు ఓటరు నమోదుకు సంబంధించిన ‘ఫారం 6’ (Form 6) మార్పులకు సంబంధించిన వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.

ఈ వ్యవహారానికి సంబంధించి సమాధానం చెప్పాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంచలన నోటీసులు జారీ చేస్తూ ఆదేశించారు.

అదే సమయంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి సస్పెండ్ చేయాలని పిటిషనర్ల తరఫున చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అయినప్పటికీ, ఎన్నికల సంఘం ఏకపక్షంగా మార్పులు చేసి ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టిన కొత్త ‘ఫారం 6’ను సుప్రీంకోర్టు ఇంకా అధికారికంగా ఆమోదించలేదని (గుర్తించలేదని) న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించి, పార్లమెంటు ఆమోదం లేకుండా ‘ఫారం 6’ను సవరించారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. సుప్రీంకోర్టు జారీ చేసిన ఈ నోటీసులు మరియు “ఇంకా ఆమోదించలేదు” అనే సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘానికి న్యాయపరమైన సంక్షోభాన్ని సృష్టించడంతో పాటు జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని, చర్చను రేకెత్తించాయి.


Posted

in

by

Tags: