“U19 ఆడేవరకు నేను క్రికెట్ ఆడుతున్నట్లే మా నాన్నకు తెలీదు!” – నేను అసలు బౌలర్‌నే కాదు; రషీద్ ఖాన్ పంచుకున్న భావోద్వేగ రహస్యం!

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ రోజుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

‘నువ్వు మొదట్లో బౌలర్‌వి కాదు కదా, బ్యాటర్‌గానే ఉన్నావు కదా?’ అని ఆకాష్ చోప్రా అడిగిన ప్రశ్నకు రషీద్ ఖాన్ సమాధానమిస్తూ.. ‘నేను లోకల్ టోర్నమెంట్లలో ఆడుతూ బాగా రాణిస్తున్నప్పుడు, ‘నువ్వు డొమెస్టిక్ క్రికెట్‌లో ఎందుకు ఆడకూడదు?’ అని చాలామంది నన్ను అడిగారు’ అని గుర్తుచేసుకున్నాడు.

ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘ఆ తర్వాత డొమెస్టిక్ మ్యాచ్‌ల్లో ఆడి సెలెక్ట్ అయి ఆఫ్ఘనిస్తాన్ U19 జట్టులో చోటు దక్కించుకున్నాను. పాకిస్థాన్‌తో జరిగిన U19 మ్యాచ్‌లో 8వ వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి 65 పరుగులు చేసి లైమ్‌లైట్‌లోకి వచ్చాను. అంతవరకు నేను అసలు క్రికెట్ ఆడుతున్న విషయమే మా నాన్నకు తెలీదు! ‘మీ అబ్బాయి టీవీ లైవ్‌లో వస్తున్నాడు’ అని పొరుగువారు చెప్పినప్పుడు కూడా, నేను వీధిలో ‘గల్లీ క్రికెట్’ మాత్రమే ఆడుతున్నానని ఆయన అనుకున్నారు.

కానీ, నేను ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకే ఆడుతున్నానని తెలుసుకున్న తర్వాత, ఆయన నాకు పూర్తి మద్దతు ఇచ్చి ప్రోత్సహించారు’ అని రషీద్ ఖాన్ భావోద్వేగంతో వెల్లడించాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *