యూపీఎస్సీ (UPSC) 2025 సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలను ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో అనుజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి టాపర్‌గా నిలిచారు. రాజేశ్వరి సువే ఎం రెండో స్థానాన్ని, ఆకాంశ్ ధుల్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
మొత్తం 958 మంది అభ్యర్థులు వివిధ కేంద్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఐఏఎస్ (IAS), ఐఎఫ్ఎస్ (IFS), ఐపీఎస్ (IPS) వంటి విభాగాల్లో అధికారుల ఎంపిక కోసం ప్రతి ఏటా ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
టాప్-10 విజేతల జాబితా:
అనుజ్ అగ్నిహోత్రి
రాజేశ్వరి సువే ఎం
ఆకాంశ్ ధుల్
రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా
ఈశాన్ భట్నాగర్
జీనియా అరోరా
ఏ ఆర్ రాజా మొహద్దీన్
పక్షల్ సెక్రటరీ
ఆస్థా జైన్
ఉజ్వల్ ప్రియాంక్
ముఖ్యమైన గణాంకాలు:
మొత్తం ఖాళీలు: 1,087
ఎంపికైన వారు: 958
IAS కేటాయింపు: 180 మంది (జనరల్-74, OBC-47, SC-28, EWS-18, ST-13)
IPS కేటాయింపు: 150 మంది
IFS కేటాయింపు: 55 మంది
పరీక్షా ప్రస్థానం:
గత ఏడాది మే 25న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఆగస్టు 22 నుండి 31 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా, ఎంపికైన 2,736 మందికి జనవరి 5, 2026 నుండి ఫిబ్రవరి 27 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తుది ఫలితాల తర్వాత అభ్యర్థుల మార్కు షీట్లను 15 రోజుల్లోపు అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో ఉంచుతారు.

Leave a Reply