WhatsApp నుండి గ్రీన్ కలర్ విడ్కోలు? మీకు నచ్చిన రంగులో మెరిసిపోనున్న యాప్.. చాటింగ్ స్టైల్ మొత్తం మారిపోతుంది!

మీరు కూడా ఏళ్ల తరబడి వాట్సాప్‌లో అదే పాత గ్రీన్ ఇంటర్‌ఫేస్ చూసి బోర్ కొట్టారా? అయితే మెటా సంస్థ మీ చాటింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. త్వరలోనే మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ లుక్ మారనుంది. గ్రీన్ కలర్ బదులు ఏ రంగు వస్తుంది అని ఆలోచిస్తున్నారా? యాప్ రంగును, చివరికి ఐకాన్‌ను కూడా మీకు నచ్చినట్లుగా మార్చుకునే సరికొత్త ఫీచర్‌పై కంపెనీ పనిచేస్తోంది.

బీటా వెర్షన్‌లో కొత్త ఫీచర్లు వాట్సాప్ అప్‌డేట్స్‌ను పర్యవేక్షించే ‘WABetaInfo’ ప్రకారం, ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్ 2.26.6.1లో కొత్త కస్టమైజేషన్ టూల్స్ కనిపించాయి. దీని ద్వారా మీరు యాప్ థీమ్, యాక్సెంట్ కలర్ (Accent Color) మరియు హోమ్ స్క్రీన్ ఐకాన్‌ను మార్చుకోవచ్చు.

14 కొత్త స్టైలిష్ ఐకాన్లు వాట్సాప్ 14 రకాల కొత్త యాప్ ఐకాన్లపై పనిచేస్తోంది. ఇందులో బ్లూ, పింక్, ఆరెంజ్ వంటి రంగులతో పాటు అరోరా (Aurora), గెలాక్సీ మరియు నియాన్ వంటి స్టైలిష్ డిజైన్లు కూడా ఉంటాయి. దీని కోసం మీరు వేరే ఏ థర్డ్ పార్టీ యాప్స్ వాడాల్సిన అవసరం లేదు.

19 రంగుల్లో వాట్సాప్ కేవలం ఐకాన్ మాత్రమే కాదు, యాప్ లోపల ఉండే బటన్లు మరియు ట్యాబ్‌ల రంగులను కూడా మార్చుకోవచ్చు. వాట్సాప్ త్వరలో వినియోగదారులకు దాదాపు 19 కలర్ ఆప్షన్లను అందించనుంది. ఇందులో రాయల్ బ్లూ, కోరల్ మరియు డార్క్ ఆలివ్ గ్రీన్ వంటి షేడ్స్ ఉంటాయి. పాత వాట్సాప్‌ను ఇష్టపడే వారి కోసం ‘క్లాసిక్ డిజైన్’ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది, త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.


Posted

in

by

Tags: