టైటిల్‌ను అందించడంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించారు. అయితే, ఈ గెలుపు ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల తర్వాత రావడం విశేషం. ముఖ్యంగా గాయకుడు పలాష్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు కావడంతో, నెటిజన్లు అతడిపై జోకులు పేలుస్తున్నారు. తాజాగా స్మృతి తల్లి కూడా ఈ విషయంలో స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
పలాష్‌పై స్మృతి తల్లి సెటైర్లు: ఫైనల్ మ్యాచ్ తర్వాత ఒక మీమ్ పేజీ, “స్మృతి ప్రత్యర్థి బౌలర్లను బాదుతుంటే.. ఆమెకు బంతిలో తన మాజీ ప్రియుడు పలాష్ ముఖం కనిపిస్తున్నట్లుంది” అనే అర్థం వచ్చేలా ఒక మీమ్‌ను పోస్ట్ చేసింది. స్మృతి తల్లి స్మితా మంధాన ఈ మీమ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ఆ జోక్‌ను సమర్థించారు.
నెటిజన్ల స్పందన: ఇది చూసిన నెటిజన్లు “ఆంటీ చాలా సావేజ్ (Savage)” అంటూ కామెంట్లతో ముంచెత్తారు. “స్మృతి తల్లి పలాష్‌ను వండేశారు (Cooking)” అంటూ కొందరు, ఆమె పొరపాటున షేర్ చేశారేమో అని మరికొందరు చర్చించుకున్నారు. అయితే, ఈ స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో శనివారం ఉదయానికి ఆమె ఆ పోస్ట్‌ను తొలగించారు.
మ్యాచ్ విశేషాలు: ఫైనల్‌లో స్మృతి మంధాన కేవలం 41 బంతుల్లో 87 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు. మ్యాచ్‌కు ముందు రాత్రి ఆమె 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
