అంతా ఒక నాటక రంగం.. యుద్ధ విరామానికి ‘నో’ చెప్పిన ఇరాన్.. కోట్లలో లాభాలు చూసిన దిగ్గజాలు

టెహ్రాన్: అమెరికా ప్రతిపాదించిన యుద్ధ విరామ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. ఈ పరిణామం తర్వాత ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు వృద్ధి చెందాయి, స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.

ఇరాన్ యుద్ధ విరామ ఒప్పందాన్ని అత్యంత వేగంగా తోసిపుచ్చింది. శాంతికి ఆ దేశం ‘నో’ చెప్పిన మరుక్షణమే, ప్రపంచ స్టాక్ మార్కెట్లు (Wall Street) ఉత్సాహంతో ఉరకలేశాయి. రక్తం చిందించే యుద్ధభూమిలో శాంతి ప్రయత్నాలు విఫలమైనప్పుడు, మార్కెట్లు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నాయి? ఇందులో లాజిక్ ఏమైనా ఉందా?

ఇక్కడే ‘జియో-పాలిటిక్స్’ (భౌగోళిక రాజకీయాలు) అనే చదరంగం దాగి ఉంది. గత ఏడాది చైనా ఆడిన పాత ‘ప్లే-బుక్’ వ్యూహాన్నే ఇప్పుడు ఇక్కడ అమలు చేస్తున్నారు.

పెట్రోల్ ధరలా? చర్చలా? వైట్ హౌస్ నుండి టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ నివాసం వరకు శాంతి చర్చల కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవీ ఫలించలేదు. వైట్ హౌస్ ఈ చర్చల కోసం తీవ్రంగా శ్రమించింది. చివరికి పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా పెట్టుకుని కూడా చర్చలు జరిపారు.

అన్నింటికంటే ముఖ్యమైనది పాకిస్థాన్ ‘మీడియేటర్’ (మధ్యవర్తి) అవతారం. అమెరికాకు, ఇరాన్‌కు మధ్య ప్రత్యక్ష చర్చలు లేవు. వాషింగ్టన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయమే ఇరాన్ యొక్క అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం టెహ్రాన్ మరియు వాషింగ్టన్ మధ్య రహస్య సమాచారాన్ని చేరవేసే ఏకైక ‘హాట్‌లైన్’ ఇస్లామాబాద్ మాత్రమే. ఒకవైపు అమెరికా అధ్యక్షుడి బృందంతో రహస్య ఒప్పందాలు, మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్‌తో స్నేహం.. ఇలా రెండు వైపులా ఒకే టేబుల్ మీదకు తెచ్చే ‘పంచాయితీదారు’ పనిని పాకిస్థాన్ చక్కగా చేస్తోంది. ఒకవేళ ఈ యుద్ధం ముగిస్తే, ప్రపంచ వేదికపై పాకిస్థాన్ దౌత్య విలువలు పెరుగుతాయనడంలో సందేహం లేదు!

కానీ నిజానికి వైట్ హౌస్ రహస్య గదుల్లో కూర్చున్న ఎవరికీ శాంతిపై ఆసక్తి లేదు. వారికి కావాల్సిందల్లా ‘లెవరేజ్’ (ప్రయోజనం) మాత్రమే. అంటే యుద్ధం ద్వారా ఎలా డబ్బు సంపాదించాలి అనేదే వారి ఆలోచన. అమెరికా సాధారణంగా యుద్ధం చేసినప్పుడు, దానిని ఉపయోగించుకుని కొన్ని సెంటర్లు స్టాక్ మార్కెట్లలో కోట్లాది రూపాయల లాభాలను గడిస్తాయి. అమెరికా ఇప్పుడు కూడా అదే చేస్తోంది.

ఇరాన్ లెక్క: స్టాక్ మార్కెట్‌ను పాజిటివ్‌గా మార్చడం కోసం ట్రంప్ చర్చలు జరుగుతున్నాయని అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. చర్చలు జరుగుతున్నాయి.. పాకిస్థాన్ వస్తోంది.. శాంతి రాబోతోంది అని నమ్మిస్తున్నారు. దీనిని నమ్మి మార్కెట్ వృద్ధి చెందుతోంది.

చాలామంది పడిపోయిన షేర్లు మళ్ళీ పెరుగుతున్నాయి. అంటే యుద్ధం ఆగని పరిస్థితుల్లో కూడా యుద్ధం ఆగిపోతుందనే భ్రమను కల్పిస్తున్నారు. వచ్చే వారం స్టాక్ మార్కెట్ ప్రారంభమయ్యే లోపు ఒక పాజిటివ్ హెడ్‌లైన్ కావాలన్నదే అమెరికా ప్లాన్. అందుకే “చర్చల్లో పురోగతి” అనే వార్తలను లీక్ చేసి ధరలను అదుపులో ఉంచాలని చూస్తున్నారు.

మరోవైపు ఇరాన్‌కు ముడి చమురు ధర బారెల్‌కు 120 డాలర్లను తాకాలి. అప్పుడే వారి ఆర్థిక వ్యవస్థ ఊపిరి పీల్చుకుంటుంది. అందుకే “యుద్ధం కొనసాగుతుంది” అనే బింబాన్ని ఇరాన్ రాజకీయ నాయకులు కొనసాగిస్తున్నారు.

ఒకవైపు 3,000 మంది అదనపు సైనికులు మధ్యప్రాచ్య దేశాలకు తరలిపోతుంటే, మరోవైపు ఇరు దేశాలు మార్కెట్ కోసం ఒక నాటకాన్ని ఆడుతున్నాయి. అంటే ఆగిపోని యుద్ధాన్ని ఆగిపోతుందని నమ్మిస్తున్నారు.


Posted

in

by

Tags: