ఒక మహిళ తన ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని (5th Wedding Anniversary) ఘనంగా జరుపుకోవాలని భావించి, ఇల్లంతా అందంగా అలంకరించి తన స్నేహితురాళ్లను ఇంటికి పిలిచింది.
వేడుక జరుగుతున్న సమయంలో, ఆమె తన భర్తకు కేక్ తినిపిస్తున్నట్లు నటిస్తూ (ప్రాంక్ చేస్తూ).. అతనికి తినిపించకుండా వెనక్కి లాక్కుంది. ఇలా పలుమార్లు ప్రయత్నించినా భార్య తనకు కేక్ తినిపించకపోవడంతో ఆ భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ఆ కోపంలో భార్య చేతిలోని కేక్‌ను గట్టిగా కిందకు కొట్టేసి, అక్కడ అలంకరించిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేశాడు. అంతేకాకుండా, వచ్చిన అతిథులు ఇచ్చిన బహుమతులను (Gifts) కూడా తీసుకోవడానికి నిరాకరించి, ఒకచోట కోపంగా కూర్చుండిపోయాడు.
భర్త ఆగ్రహానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ అవ్వగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం భార్యకు మద్దతుగా, మరో వర్గం భర్త చర్యను సమర్థిస్తూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
