ముంబై/హెల్త్ డెస్క్: దేశీ కుబేరుడు ముఖేష్ అంబానీ విలాసవంతమైన జీవనశైలి గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఆయన ఇంట్లో పని చేసే సిబ్బందికి అందే జీతాల గురించి తెలిస్తే సామాన్యుల కళ్లు బైర్లు కమ్మాల్సిందే. తాజాగా అంబానీ నివాసం ‘యాంటిలియా’లో రొట్టెలు చేసే చెఫ్ జీతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నెలకు అక్షరాలా రూ. 2 లక్షల వేతనం అంటే ఏడాదికి రూ. 24 లక్షల ప్యాకేజీ అన్నమాట!
ఇదేదో వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే పుకారు కాదు.. వాస్తవమే. ఇంత భారీ జీతం ఎందుకు ఇస్తున్నారు? అక్కడ రొట్టెలు చేయడం అంత కష్టమా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
- రోజూ 4,000 రొట్టెలు: అంబానీ కుటుంబం శుద్ధ శాకాహారులు. వారు డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. కేవలం అంబానీ కుటుంబమే కాకుండా, వారి ఇంట్లో పని చేసే 600 మందికి పైగా సిబ్బందికి, ప్రతిరోజూ వచ్చే అతిథులకు కలిపి రోజుకు దాదాపు 4,000 రొట్టెలు తయారు చేయాల్సి ఉంటుంది.
- క్వాలిఫికేషన్ తప్పనిసరి: కేవలం రొట్టెలు చేయడమే కదా అని ఎవరైనా వెళ్లి అక్కడ జాయిన్ అవ్వలేరు. అక్కడ పని చేయాలంటే ‘హోటల్ మేనేజ్మెంట్’ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ప్రొఫెషనల్ చెఫ్ అయి ఉంటేనే అంబానీ వంటి అతిపెద్ద కుటుంబానికి వంట చేసే అవకాశం దక్కుతుంది.
- ఆధునిక టెక్నాలజీ: వేల సంఖ్యలో రొట్టెలు అంటే చేత్తో చేయడం సాధ్యం కాదు. అందుకే యాంటిలియాలో అత్యాధునిక ‘రోటీ మేకింగ్ మెషీన్స్’ ఉన్నాయి. మెషీన్ సాయంతోనే ఈ రొట్టెలు తయారు చేస్తారు. అయితే, ఆ మెషీన్లను ఆపరేట్ చేస్తూ, నాణ్యతను పర్యవేక్షించే మెయిన్ చెఫ్ కి ఈ భారీ జీతం చెల్లిస్తారు.
- సిబ్బందికి ప్రత్యేక ప్రాధాన్యత: 27 అంతస్తుల ఈ లగ్జరీ భవనంలో సిబ్బంది కోసం ఒక ప్రత్యేక అంతస్తునే కేటాయించారు. అంబానీ కుటుంబం తమ సిబ్బందిని కూడా సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అందుకే వారికి అందించే ఆహారంలోనూ రాజీ పడరు.
- అంబానీ ఫేవరెట్ ఫుడ్: ముఖేష్ అంబానీకి సాధారణమైన పప్పు, రొట్టె, అన్నం అంటే చాలా ఇష్టం. థాయ్ వంటకాలను కూడా ఇష్టపడే ఆయన, ప్రతి ఆదివారం మాత్రం ఖచ్చితంగా ఇడ్లీ-సాంబార్ తింటారు.
మొత్తానికి అంబానీ ఇంట్లో రొట్టెలు చేసే చెఫ్.. మన దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువే సంపాదిస్తున్నారన్నమాట!
