అక్క కొడుకుతో అక్రమ సంబంధం! “పలుమార్లు ఇల్లు వదిలి పారిపోయిన భార్య”. అవమానం భరించలేక ఇద్దరు కుమారులను చంపి పూజారి ఆత్మహత్య..!!!

తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో భార్య ప్రియుడితో పారిపోవడంతో మనస్తాపం చెందిన ఒక అర్చకుడు తన ఇద్దరు కుమారులను గొంతు నులిమి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘటన వివరాలు: శివన్న (40) అనే వ్యక్తి స్థానిక మల్లేశ్వర స్వామి దేవాలయంలో అర్చకుడిగా పనిచేసేవాడు. అతనికి కావ్య (30) అనే భార్య, జీవన్ (10), ప్రాణేష్ (6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కావ్యకు, శివన్న స్వయానా అక్క కొడుకైన హేమంత్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా కావ్య తన ప్రవర్తన మార్చుకోలేదు. గత వారం ప్రియుడితో కలిసి ఇల్లు వదిలి పారిపోయిన కావ్య, పోలీసుల ఫిర్యాదు తర్వాత రెండు రోజుల క్రితమే తిరిగి ఇంటికి వచ్చింది. కానీ, మళ్ళీ ఇంట్లో ఉన్న నగలు, నగదు తీసుకుని హేమంత్‌తో పారిపోయింది.

నిరంతర అవమానం, భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన శివన్న, నిన్న ఉదయం తన ఇద్దరు కుమారులను గొంతు నులిమి హత్య చేసి, ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించేసరికి కుమారులు సోఫాపై, శివన్న ఫ్యాన్‌కు వేలాడుతూ శవాలుగా పడి ఉన్నారు.

పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కావ్య పెట్టిన వేధింపుల వల్ల మూడేళ్ల క్రితమే శివన్న తల్లి హొన్నమ్మ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న కావ్య, హేమంత్ కోసం గాలిస్తున్నారు.


Posted

in

by

Tags: