తమిళనాడు కారియాపట్టికి చెందిన ఇళయరాజా, ముత్తులక్ష్మి దంపతులు తమ కూతురితో కలిసి జీవించేవారు. అయితే భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన సమయంలో, ముత్తులక్ష్మికి మణికందన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. 2016లో తిరిగొచ్చిన ఇళయరాజాకు వీరి విషయం తెలిసి మణికందన్‌ను హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మణికందన్, ఇళయరాజాను ఇనుప రాడ్‌తో కొట్టి చంపి అడవిలో పాతిపెట్టాడు.
వెలుగులోకి వచ్చిన నిజం: భర్త కనిపించడం లేదని ముత్తులక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడింది. అయితే, రెండేళ్ల తర్వాత పోలీసుల విచారణలో ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తనను పట్టుకుంటారని భయం వేసిన ముత్తులక్ష్మి, మణికందన్‌కు ఫోన్ చేసి పాతిపెట్టిన శవాన్ని తీసి నాశనం చేయమని చెప్పింది. మణికందన్ ఆ శవాన్ని తవ్వి తీసి, ఎముకలను వగై నదిలో కలపడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. 2018లో ముత్తులక్ష్మి, మణికందన్‌తో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
