రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ నాయకత్వ లక్షణాలు, ఆటగాళ్లతో అతను స్పష్టంగా సంభాషించే తీరు (కమ్యూనికేషన్ స్కిల్స్) తనకు ఎంతగానో నచ్చే గుణాలని భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్ బహిరంగంగా ప్రశంసించాడు.
మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జురెల్.. సంజూ శాంసన్ జట్టును నడిపించే విధానం, ఆటగాళ్లతో అతను చూపించే స్నేహభావం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
జట్టులోని ప్రతి ఆటగాడితో ఎంతో అరమరికలు లేకుండా, మనసు విప్పి మాట్లాడే విధానమే సంజూ శాంసన్‌లో ఉన్న అత్యంత ముఖ్యమైన గుణమని జురెల్ పేర్కొన్నాడు.
కేవలం ఒక కెప్టెన్‌గానే కాకుండా, మంచి మనసున్న వ్యక్తిగా తోటి ఆటగాళ్ల నమ్మకాన్ని గెలుచుకోవడమే అతని అతిపెద్ద బలమని తెలిపాడు. ఐపీఎల్ (IPL) టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నప్పుడు సంజూ కెప్టెన్ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని జురెల్ గర్వంగా చెప్పాడు.

Leave a Reply