“అన్నా, ఒకసారి జీరో చూసుకోండి”.. పెట్రోల్ బంక్‌లో లేడీ ఉద్యోగి చేతివాటం! కెమెరాకు చిక్కిన షాకింగ్ స్కామ్.. వైరల్ వీడియో!

రాయ్‌పూర్: మనం సాధారణంగా పెట్రోల్ బంకులకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది “సార్, ఒకసారి మీటర్ లో జీరో (0) చూసుకోండి” అని చెప్పడం వినే ఉంటాం.

చాలా మంది దీన్ని ఒక సాధారణ విషయంగా తీసుకుని లైట్ తీసుకుంటారు. కానీ, హడావిడిలో ఉన్నవారిని, మొబైల్ ఫోన్లలో బిజీగా ఉండే కస్టమర్లను టార్గెట్ చేస్తూ పెట్రోల్ బంకుల్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో కళ్లకు గట్టేలా చూపే ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గీతమ్ రోడ్డులో ఉన్న కృష్ణా పెట్రోల్ బంక్‌లో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది.

మాటల్లో దించి మాయ చేసిందిలా: అక్కడికి పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన ఒక కస్టమర్‌తో, అక్కడ పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి కావాలనే మాటలు కలిపి ఆయన దృష్టిని మళ్లించింది. “డబ్బులు క్యాష్ ఇస్తారా? లేదా ఆన్‌లైన్ పేమెంట్లా?” అని అడుగుతూ కస్టమర్‌ను మాటల్లో ముంచేసింది. ఆ గ్యాప్‌లోనే రీడింగ్ మీటర్‌ను పూర్తిగా జీరోకు మార్చకుండా.. అప్పటికే మీటర్‌లో ఉన్న ₹200 రీడింగ్‌ను అలాగే ఉంచేసింది. కస్టమర్ ₹500 రూపాయల పెట్రోల్ కావాలని అడగ్గా.. మీటర్‌లో ₹500 రాగానే పెట్రోల్ కొట్టేసానని, బండి తీసేయమని చెప్పింది.

కెమెరాకు చిక్కిన కేటుగాళ్లు: అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సదరు లేడీ ఉద్యోగి మాటల మాయలో పడటం వల్ల ఆ వాహనంలో వాస్తవానికి కేవలం ₹300 రూపాయల పెట్రోల్ మాత్రమే పడింది. కానీ మిగిలిన ₹200 రూపాయలు కస్టమర్ జేబు నుండి మోసపూరితంగా బంక్ సిబ్బంది ఖాతాలోకి వెళ్ళిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ, ఆ కస్టమర్ ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ (Vlogger) కావడంతో.. ఆయన బైక్‌కు అమర్చి ఉన్న ‘ఇన్‌స్టా 360’ (Insta360) కెమెరాలో ఈ మోసం మొత్తం అంగుళం అంగుళం రికార్డ్ అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ పెట్రోల్ బంక్ సిబ్బంది గుట్టును రచ్చకీడ్చింది.


Posted

in

by

Tags: