లైఫ్‌స్టైల్ డెస్క్: వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండల కంటే దోమల కాటే ఎక్కువ బాధిస్తుంది. సాయంత్రం అయిందంటే చాలు సైన్యంలా ఇంటి మీద దాడి చేసే ఈ దోమలు, కేవలం రక్తం తాగడమే కాదు.. డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో మనిషిని మంచం పట్టేలా చేస్తాయి. ముఖ్యంగా పసిపిల్లలను దోమల నుండి రక్షించడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. మార్కెట్లో దొరికే కాయిల్స్, స్ప్రేలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి కాబట్టి, వాటికి బదులుగా వంటింట్లో ఉండే వస్తువులతోనే దోమలను ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు చూద్దాం.
100% నేచురల్ దోమల నివారణ తైలం:
ఈ చిట్కా పూర్తిగా సహజ సిద్ధమైనది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు:
- వేపాకులు (ఎండబెట్టినవి)
- లవంగాలు
- కర్పూరం
- ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లి పొట్టు
- బిర్యానీ ఆకులు (దాదాల్చిన ఆకు)
- నూనె (అర కప్పు)
తయారీ విధానం:
- ముందుగా ఎండబెట్టిన వేపాకులు, బిర్యానీ ఆకులు, ఉల్లి-వెల్లుల్లి పొట్టు మరియు లవంగాలను మిక్సీలో వేసి మెత్తటి పొడిగా చేసుకోవాలి. (గమనిక: మిక్సీలో కర్పూరం వేయకండి).
- ఒక బాణలిలో అర కప్పు నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కగానే మనం తయారు చేసుకున్న పొడిని అందులో వేసి బాగా మరిగించాలి.
- ఇప్పుడు ఇందులో కర్పూరం బిళ్ళలను వేయాలి. కర్పూరం నూనెలో పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆపేయాలి.
- ఈ నూనె చల్లారాక వడకట్టి, ఖాళీగా ఉన్న దోమల లిక్విడ్ వేపరైజర్ (Mosquito Vaporizer) బాటిల్లో నింపి వాడాలి. ఇది దోమలను తక్షణమే పారద్రోలుతుంది.
ఉల్లిపాయ దీపం – మరో అద్భుత చిట్కా:
మీరు లిక్విడ్ వాడకూడదు అనుకుంటే ‘ఉల్లిపాయ దీపం’ ప్రయత్నించవచ్చు.
- ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని దాని మధ్యలో గుంతలా చేయాలి.
- అందులో మనం పైన చెప్పుకున్న పొడిని వేసి, కొద్దిగా నూనె పోయాలి.
- ఒక వత్తి వేసి దీపం వెలిగిస్తే, ఆ వాసనకు దోమలు ఇంట్లోకి అస్సలు రావు.
