టీ20 క్రికెట్ మ్యాచ్‌లో మూడు సెంచరీలు (ట్రిపుల్ సెంచరీ) సాధించడం అనేది ఊహకు అందని విషయం. కానీ, భారత్‌కు చెందిన ఒక పాఠశాల విద్యార్థి టీ20 మ్యాచ్‌లో 311 పరుగులు బాది రికార్డు పుస్తకాలను షేక్ చేశాడు.
ఢిల్లీలో జరిగిన పాఠశాల స్థాయి టీ20 లీగ్ టోర్నమెంట్లో ఈ నమ్మశక్యం కాని ఘటన చోటుచేసుకుంది. సుమేర్మల్ జైన్ స్కూల్ జట్టు తరఫున ఆడిన ఆర్యన్ శర్మ అనే విద్యార్థి ఈ చారిత్రాత్మక ఆటను ప్రదర్శించాడు.
ఇంద్రప్రస్థ వరల్డ్ స్కూల్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో, ఆర్యన్ శర్మ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 93 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతను, 27 బౌండరీలు (ఫోర్లు) మరియు 30 సిక్సర్ల సహాయంతో దిగ్భ్రాంతి కలిగించేలా 311 పరుగులు సాధించాడు.
ఇతని విధ్వంసకర ఆట పుణ్యమా అని, సుమేర్మల్ జైన్ స్కూల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
కొండంత లక్ష్య ఛేదనలో ఇంద్రప్రస్థ స్కూల్ జట్టు 19.5 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆర్యన్ శర్మ స్కూల్ జట్టు 247 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇతని ఈ ఆట స్కోర్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply