అమెరికా: అమెరికాలోని అట్లాంటాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే, ఒక ఫెడరల్ జడ్జి తన ఛాంబర్లో పోలీస్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది.
అసలేం జరిగింది? బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఫెడరల్ జడ్జి ఎలియనోర్ రాస్ మరియు అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ కమ్యూనిటీ సర్వీస్ డివిజన్ కమాండర్ కెల్లీ కొల్లియర్ మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ అప్పటికే వివాహితులు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా వారు తమ ఛాంబర్లో ఏకాంతంగా గడపడం, ఆ సమయంలో వచ్చే శబ్దాలు బయట ఉన్నవారికి ఇబ్బంది కలిగించేవని ఫిర్యాదులు అందాయి.
తీసుకున్న చర్యలు: ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ కమిటీకి ఫిర్యాదు అందడంతో విచారణ మొదలైంది. కెల్లీ కొల్లియర్కు అధికారులు నోటీసులు జారీ చేశారు. జడ్జి ఎలియనోర్ రాస్ 2014 నుండి జార్జియా ఉత్తర జిల్లా కోర్టులో జడ్జిగా సేవలందిస్తున్నారు. విచారణలో భాగంగా వీరిద్దరిపై బలమైన సాక్ష్యాలు లభించడంతో, జడ్జి ఎలియనోర్ రాస్‌పై కఠినమైన ఆంక్షలు విధించారు. ఆమె ఇకపై ఫెడరల్ కోర్టులో చీఫ్ జడ్జిగా బాధ్యతలు చేపట్టడానికి లేదా ఎటువంటి జ్యుడీషియల్ కమిటీల్లో భాగస్వామి కావడానికి వీల్లేదని కమిటీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమె తన వద్ద పనిచేసే కనీసం ఆరుగురు క్లర్కులకు క్షమాపణ లేఖలు రాయాలని ఆదేశించింది.
