అమెరికా సైనికుల మృతితో ఆగ్రహం; యుద్ధం ఉధృతం చేసేందుకు ట్రంప్ సిద్ధం. ఇరాన్ పెద్ద దేశం, యుద్ధం కనీసం నాలుగు వారాలు సాగుతుంది. అమెరికన్ పౌరులు లేదా సైనికులు మరింత మంది మరణించే అవకాశం ఉన్నప్పటికీ, ఈ సైనిక చర్య చివరికి ప్రపంచానికి మంచిదేనని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు.
వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో కువైట్‌లోని అమెరికన్ బేస్‌కు చెందిన ముగ్గురు సైనికులు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన ట్రంప్, ఇరాన్‌పై యుద్ధాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇరాన్‌పై సైనిక చర్యకు కనీసం నాలుగు వారాల సమయం పట్టవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. “ఇది నాలుగు వారాల ప్రక్రియ. ఇరాన్ ఒక పెద్ద దేశం కాబట్టి ఇంత సమయం పడుతుంది” అని ఆయన బ్రిటిష్ పత్రిక ‘డైలీ మెయిల్’తో అన్నారు. చర్చలకు తాము సిద్ధమేనని, కానీ ఇరాన్ చాలా ఆలస్యం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికన్ సైనికుల రక్తాన్ని చిందించిన వారికి శాంతి ఉండదని, ఇరాన్ దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. తన పాలనలో ఇరాన్ అణ్వాయుధ ఆకాంక్షలను ఎన్నటికీ నెరవేరనివ్వనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 48 మంది ఇరాన్ నాయకులను చంపినట్లు మరియు తొమ్మిది యుద్ధనౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా పేర్కొంది.
మరోవైపు, అమెరికా విమానవాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించాయి. అయితే, ఈ క్షిపణులు లక్ష్యాన్ని చేరుకోలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో తొమ్మిది మంది మరణించినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ నివేదించింది.

Leave a Reply