వాషింగ్టన్: ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తామని ట్రంప్ ఘీంకరిస్తున్నారు. కానీ, మరోవైపు ఇరాన్ నేరుగా అమెరికా ఆర్థిక మూలాలనే దెబ్బకొడుతోంది. ఇరాన్ తీసుకుంటున్న చర్యల వల్ల మొత్తం అమెరికా ఇప్పుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా మారుతోంది.
తమ దెబ్బకు ఇరాన్ కోలుకోలేదని ట్రంప్ చెబుతున్నప్పటికీ, పరిస్థితి సీరియస్‌గా మారింది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి, ఇది నేరుగా అమెరికా వినియోగదారులపై ప్రభావం చూపుతోంది.
అమెరికాలో అసలు సమస్య ఏమిటి?
ప్రస్తుతం అమెరికాలో ఒక గ్యాలన్ పెట్రోల్ ధర 3.31 – 3.35 డాలర్ల వరకు పెరిగింది. ఒక గ్యాలన్ అంటే సుమారు 3.8 లీటర్లు. అంటే లీటరు ధర రూ. 275-280 వరకు పెరిగినట్లు లెక్క. కేవలం ఒక్క వారంలోనే రూ. 10-15 పెరగడం అమెరికా ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.
PBS News/NPR/Marist నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, మార్చి నెలలో ట్రంప్‌పై ప్రజల అసంతృప్తి 58% కి చేరుకుంది. కేవలం 35-36% మంది మాత్రమే ఆయన పనితీరును సమర్థిస్తున్నారు.
ట్రంప్‌పై పెరుగుతున్న వ్యతిరేకత
అమెరికా అధ్యక్ష చరిత్రలోనే, తన మొదటి మరియు రెండవ పదవీ కాలాల్లో (ప్రస్తుతం 2026 నాటికి) నిరంతరం 50% కంటే తక్కువ ప్రజాదరణ పొందిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే. ఇరాన్‌పై ఆయన తీసుకుంటున్న సైనిక చర్యలను కేవలం 39% మంది మాత్రమే సమర్థిస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఇరాన్‌తో అమెరికా పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగుతుందని 70% మంది అమెరికన్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ నిర్లక్ష్య సమాధానం
అయితే, ట్రంప్ మాత్రం వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. “నువ్వు యుద్ధం అంటున్నావు కానీ ఇక్కడ పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి కదా!” అని ప్రశ్నిస్తే.. “నాకు దాని గురించి చింత లేదు. యుద్ధం ముగియగానే ధరలు వాటంతట అవే తగ్గుతాయి. ఇప్పుడు నాకు అంతకంటే పెద్ద పనులు ఉన్నాయి” అని సమాధానమిచ్చారు. ఈ బాధ్యతారాహిత్యమైన సమాధానం ప్రజలకు మరింత ఆగ్రహం తెప్పించింది.
మడమ తిప్పిన ట్రంప్?
ఎన్నికల సమయంలో ట్రంప్ మాట్లాడుతూ.. “నేను అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను 50% తగ్గిస్తాను” అని హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు ధరలు పెరుగుతుంటే మాట మార్చడం ప్రజలకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటికే పన్నుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల నిత్యావసర ధరలు పెరిగాయి, ఇప్పుడు ఇంధన ధరలు కూడా తోడవ్వడం గమనార్హం.
