1991 అక్టోబరులో కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్‌లో ఉన్న ఒక పబ్‌లో 56 ఏళ్ల పైలట్ బిల్ నెల్సన్‌ను ఒమైమా కలిసింది. ధనవంతులైన వృద్ధులను వెతుకుతూ ఆమె తరచుగా ఇలాంటి చోట్లకి వస్తుండేదని అధికారులు చెబుతుంటారు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నెల రోజులు కూడా గడవకముందే పరిస్థితి దారుణంగా మారింది.
లైంగిక దాడికి ప్రతీకారంగానేనా? 1991, నవంబర్ 28న బిల్ నెల్సన్ అపార్ట్మెంట్లో ఒమైమా ఉన్నప్పుడు, ఒక రకమైన ‘లైంగిక క్రీడ’ (BDSM)లో భాగంగా బిల్ ఆమెను మంచానికి కట్టేశాడు. ఒమైమా వాంగ్మూలం ప్రకారం.. తనను హింసించవద్దని కోరినా బిల్ వినకపోవడంతో ఆమె భయపడిపోయింది. చిన్నతనంలోనే జననేంద్రియ వైకల్యానికి (FGM) గురైన ఆమెకు, ఆ సమయంలో జరిగిన కలయిక విపరీతమైన మనోవేదనను, భరించలేని నొప్పిని కలిగించింది. దీనితో ఆమె ఎలాగోలా కట్ల నుండి విడిపించుకుని, ఒక ల్యాంపుతో బిల్ తలపై కొట్టి, కత్తెరతో పొడిచి, ఇస్త్రీ పెట్టెతో తీవ్రంగా దాడి చేసి చంపేసింది.
మృతదేహాన్ని వండిన తీరు: హత్య చేసిన తర్వాత సుమారు 12 గంటల పాటు తాను ఒక రకమైన మత్తు స్థితిలోకి వెళ్ళిపోయానని, ఆ సమయంలో బిల్ శరీరాన్ని ముక్కలుగా నరికినట్లు ఒమైమా తన సైకాలజిస్ట్‌కు తెలిపింది. ఆ కసితోనే ఆమె భర్త ఆనువంశిక అవయవాన్ని (ఆణువును) కూడా సిధ్ధం చేసింది. సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి ఆమె భర్త చేతులను మరిగించి వేలిముద్రలను తొలగించింది. శరీరంలోని మాంసాన్ని వంట గదిలోని ‘గార్బేజ్ డిస్పోజల్’ మెషీన్లో వేసింది. ఆ యంత్రం రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేయడం తాము విన్నామని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు.
పోలీసులను షాక్‌కు గురిచేసిన దృశ్యాలు: పోలీసుల తనిఖీల్లో వారి ఇంట్లో భయంకరమైన దృశ్యాలు వెలుగుచూశాయి. ఒక గిన్నెలో ఉడుకుతున్న మాంసం ముక్కలు, ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలు, నూనెలో వేయించిన చేతులు, ఒక కూలర్లో భద్రపరిచిన తల చూసి పోలీసులు హతాశులయ్యారు. ఆమె తన మనోవైద్యుడితో మాట్లాడుతూ.. బిల్ పక్కటెముకలను, ఆణువును వండి దానిపై ‘బార్బెక్యూ సాస్’ వేసుకుని తిన్నట్లు అంగీకరించింది.
ప్రస్తుత పరిస్థితి: ఈ ఘోరమైన హత్యకు గాను ఒమైమా జైలు శిక్ష అనుభవిస్తోంది. ఆమెకు పెరోల్‌పై విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ, జైలులో ఆమె ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో (గార్డులపై దాడి చేయడం వంటివి) రెండుసార్లు ఆమె విడుదలను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆమె విడుదల అంశం ఇంకా పరిశీలనలోనే ఉంది.
