“అమ్మ నాన్నలను కాపాడుకోవాలి” 3 గంటల పాటు వరదలో ఈదిన కొడుకు.. చైనా యువకుడి భావోద్వేగ చర్య..!!

చైనాలో కురుస్తున్న అత్యంత భారీ వర్షాలు, చారిత్రాత్మక రికార్డులను సృష్టించిన విపరీతమైన వరదల నడుమ, తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ కోసం ఒక యువకుడు చేసిన సాహస చర్య లక్ష్లలాది మందిని ఆశ్చర్యంలో, భావోద్వేగంలో ముంచెత్తింది.

చైనాకు చెందిన షీ (Xie) అనే యువకుడి గ్రామాన్ని ఒక్కసారిగా భారీ వరదు ముంచెత్తిన నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న తన వయోధికులైన తల్లిదండ్రులను ఫోన్ లేదా ఇతర ప్రసార సాధనాల ద్వారా సంప్రదించలేని క్లిష్ట పరిస్థితి ఏర్పడింది.

భారీ వర్షాల కారణంగా సిగ్నల్ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో, వరదల్లో చిక్కుకున్న తన తల్లిదండ్రులు ప్రస్తుతం సజీవంగా ఉన్నారా లేదా అనేది కూడా తెలియక షీ తీవ్ర వేదనకు గురయ్యాడు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ఆ యువకుడు, అధికారుల సహాయక బృందాల కోసం ఎదురుచూడకుండా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో, తన తల్లిదండ్రుల ప్రాణాలను ఎలాగైనా కాపాడుకోవాలని తెగించాడు.

చుట్టూ ముసురుకున్న భయానక వరద ప్రవాహాన్ని కూడా లెక్కచేయకుండా, ఒక పాత కార్ టైర్‌ను మాత్రమే ఆధారంగా చేసుకుని, పొంగిపొర్లుతున్న వరద నీటిలోకి తన ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా దూకి ఈదడం ప్రారంభించాడు. దాదాపు 3 గంటల పాటు ప్రాణాలతో పోరాడుతూ, భయం పుట్టించే వరద ప్రవాహాన్ని ఎదుర్కొని ఈదుకుంటూ ఎట్టకేలకు తన గ్రామ నివాసానికి చేరుకున్నాడు.

మరణంతో పోరాటం తర్వాత షీ తన ఇంటికి చేరుకునేసరికి, అక్కడ ఇంటి మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరి, అతని తల్లిదండ్రులు మేడపై నడిసముద్రంలో ఉన్నట్లు తల్లడిల్లుతుండటం చూసి షాక్ అయ్యాడు. ఎంతమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా, టైర్ సహాయంతో తన తల్లిదండ్రులిద్దరినీ ఆ భారీ వరద నుండి సురక్షితంగా బయటకు తీసిన షీ, వారిని ఆ ప్రాంతంలోని ఎత్తైన కొండపై ఉన్న ఒక సురక్షితమైన ఇంట్లోకి తీసుకెళ్లి భద్రంగా ఉంచాడు.

తల్లిదండ్రుల ప్రాణాలను కాపాడుకోవడానికి 3 గంటల పాటు వరదలో ఈదుకుంటూ వచ్చిన కొడుకు అపూర్వ ప్రేమ పోరాటం, సాహస వార్తలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ప్రచారమై, నెటిజన్లందరి ప్రశంసలను, హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఆపద సమయంలో ధైర్యంగా వ్యవహరించి తల్లిదండ్రులను రక్షించిన ఈ చైనా యువకుడి చర్య, ఈనాటి తరానికి ఒక గొప్ప ఆదర్శమని చాలామంది ప్రశంసిస్తున్నారు.


Posted

in

by

Tags: