“అమ్మా.. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, నన్ను కాపాడండి!”.. కిరాతకంగా హత్య చేసి, మాంసాన్ని వండుకుని తిన్న హంతకులు!

బంగ్లాదేశ్: 2023 ఆగస్టు 28న బంగ్లాదేశ్‌లోని బందర్‌బన్ జిల్లాలో ఒక కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చదువుకుంటూనే ఒక కోళ్ల ఫారమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న షిబ్లీ సాదిఖ్, ఆ రోజు విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి తిరిగి రాలేదు.

అసలేం జరిగింది?
షిబ్లీ ఆచూకీ కోసం తల్లి ఆందోళన చెందుతుండగా, ఆమె ఫోన్‌కు షిబ్లీ నుంచి ఒక కాల్ వచ్చింది. “అమ్మా, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు.. నన్ను కాపాడండి, నాన్నకు తెలియజేయండి” అని ఏడుస్తూ ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత కొద్ది గంటలకు వచ్చిన మరో కాల్‌లో షిబ్లీని ఎవరో తీవ్రంగా కొడుతున్న శబ్దాలు వినిపించాయి. దుండగులు 14 లక్షల టాకాల (బంగ్లాదేశ్ కరెన్సీ) కోసం డిమాండ్ చేశారు. పేదరికం కారణంగా ఆ మొత్తం చెల్లించలేకపోయినా, ప్రాణాలను కాపాడుకోవడానికి షిబ్లీ తండ్రి తనకున్నవన్నీ అమ్మి, అప్పులు చేసి, చివరకు 2 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని ఆ డబ్బును అందించారు. కానీ, షిబ్లీ తిరిగి రాలేదు.

నిజం బయటపడటంతో దిగ్భ్రాంతి:
మాయమైన షిబ్లీ ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సెప్టెంబర్ 11న పోలీసులు షిబ్లీతో కలిసి పనిచేసే ఆరుగురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, షిబ్లీని హత్య చేసినట్లు వెల్లడైంది. షిబ్లీ ఆ ఫారమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నప్పుడు, ఆ ఆరుగురు స్నేహితులు కోళ్ల దాణాను దొంగిలిస్తున్నట్లు అతను గుర్తించాడు. ఈ విషయాన్ని యజమానికి చెప్పడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఆ కక్షతోనే షిబ్లీని కిడ్నాప్ చేసి చంపేయాలని నిర్ణయించుకున్నారు.

మానవత్వం లేని కిరాతకం:
దుండగులు షిబ్లీని తీవ్రంగా కొట్టి, గొంతు కోసి చంపడమే కాకుండా, మృతదేహాన్ని ముక్కలు చేసి మాంసాన్ని వండుకుని తిన్నారని విచారణలో తేలింది. ఈ దారుణం వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ముఖ్య నిందితుడు ఉమోంగ్చింగ్ మర్మాను పోలీసులు విచారణకు తీసుకెళ్తుండగా, ఆగ్రహించిన స్థానికులు పోలీసు జీపును ధ్వంసం చేసి, అతడిని దారుణంగా కొట్టి చంపేశారు. మిగిలిన ఐదుగురు నిందితులకు కోర్టు కఠిన శిక్షలు ఖరారు చేసింది.


Posted

in

by

Tags: