కోలీవుడ్ స్టార్ దంపతులు సూర్య, జ్యోతిక కలిసి తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న ’20 Years of Love & War’ కొలాబ్ వీడియో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా దూసుకుపోతోంది.
వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఎంతో మందికి ఆదర్శ జంటగా నిలిచిన వీరిద్దరూ, తమ 20 ఏళ్ల వైవాహిక ప్రయాణాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. పోస్ట్ చేసిన క్షణం నుంచే నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈ వీడియో, కనీవినీ ఎరుగని రీతిలో వ్యూస్ కొల్లగొడుతూ రికార్డుల దిశగా దూసుకెళ్తోంది.
విడుదలైన కేవలం 18 గంటల్లోనే 2.2 కోట్ల వ్యూస్తో పాటు 20 లక్షలకు (2 మిలియన్లకు) పైగా లైకులను సాధించింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే మరో స్థాయికి చేరింది.
ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే వ్యూస్ భారీగా పెరిగి, ఏకంగా 4.8 కోట్ల (48 మిలియన్ల) వ్యూస్, 37 లక్షలకు పైగా లైకులను సాధించి, గ్లోబల్ లెవెల్లో సోషల్ మీడియా ట్రెండింగ్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ రికార్డు వేగాన్ని చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు “స్వచ్ఛమైన ప్రేమకు, ఇన్నేళ్ల కళా ప్రయాణానికి దక్కిన అసలైన విజయం ఇది!” అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సూర్య-జ్యోతికల ఈ వీడియో నెట్టింట సరికొత్త మైలురాయిని నెలకొల్పి రికార్డులన్నింటినీ తిరగరాసింది.

Leave a Reply