గోరఖ్‌పూర్‌కు చెందిన సంధ్య, హిమాన్షు అనే ఇద్దరు యువతీయువకులు గాఢంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వ్యవహారంలో షికార్లు, పార్కులు, ఖరీదైన రెస్టారెంట్లు మరియు విలాసవంతమైన హోటళ్లలో గడపడానికి భారీగా డబ్బు అవసరమైంది.
డబ్బు కొరత రావడంతో, జల్సాల కోసం వీరిద్దరూ కలిసి ఒక విచిత్రమైన నేర వ్యూహాన్ని పన్నారు.
తాము పాఠశాల విద్యార్థులమని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యూనిఫాం/కాలేజీ తరహా వేషధారణ వేసుకుని, భుజాలకు స్కూల్ బ్యాగులు తగిలించుకుని బయలుదేరారు. అయితే, ఆ బ్యాగుల లోపల పుస్తకాలకు బదులుగా సుమారు ₹5 లక్షల విలువైన 11 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి.
ఈ గంజాయిని మధ్యప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తుండగా, క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి బయటపడటంతో ఒక్కసారిగా విస్తుపోయారు. వెంటనే ఆ ప్రేమికులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. “ఇక జైలుకు వెళ్లి రొమాన్స్ చేసుకోండి, అక్కడ అన్నీ ఉచితమే” అంటూ పోలీసులు వారిని ఎగతాళి చేస్తూ కేసు నమోదు చేశారు.

Leave a Reply