“అయ్యయ్యో తలుపు తీయండబ్బా” అంటూ లబోదిబోమన్న దొంగలు.. షాప్‌కు తాళం వేసి గట్టి షాకిచ్చిన మాస్ ఉద్యోగి!

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఒక దుకాణంలో దోపిడీకి వచ్చిన దొంగలకు, అక్కడి ఉద్యోగి ఒకరు తన అసాధారణ తెలివితేటలతో గట్టి షాకిచ్చిన ఆసక్తికరమైన సంఘటన వెలుగుచూసింది.

సదరు దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దొంగలు అక్కడి వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఉద్యోగి భయపడి పారిపోవడం కానీ, లేదా వారితో గొడవకు దిగడం కానీ చేయకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించాడు.

వారు దొంగతనం చేయడాన్ని అడ్డుకోకుండా అలాగే వదిలేసి, శబ్దం చేయకుండా చాలా సైలెంట్‌గా దుకాణం నుండి బయటకు వచ్చేశాడు. దొంగలిద్దరూ షాప్‌ను లూటీ చేయడంలో మునిగిపోయిన తరుణంలో.. ఆ ఉద్యోగి క్షణాల వ్యవధిలో షాప్ బయటి తలుపులకు తాళం వేసి, వారిని లోపలే బంధించేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన దొంగలు బయటకు రాలేక, లోపలే చిక్కుకుపోయి తలుపులు బాదుకుంటూ ఏడ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్ (X) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో విడుదలై నెటిజన్ల మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags: