డిజిటల్ గ్యాడ్జెట్లకు బానిసైన తన కుమారుడిని ఆ అలవాటు నుండి మళ్ళించడానికి ఒక తండ్రి అనుసరించిన వింత పద్ధతి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
తన వద్ద నుండి టాబ్లెట్‌ను తీసుకున్నప్పుడల్లా ఆ బాబు ఎంతో ఆవేశంగా, మొండిగా ప్రవర్తించేవాడు. అతడిని మార్చడానికి, బాబు నిద్రపోతున్న సమయంలో తండ్రి కళ్ల చుట్టూ నల్లటి మై (కాటుక) పూశాడు. ఉదయం నిద్రలేచిన బాబు అద్దంలో తన కళ్లను చూసుకుని భయపడిపోయాడు. ఎక్కువ సమయం స్క్రీన్ (టాబ్లెట్) చూడటం వల్లే కళ్లు ఇలా అయిపోయాయని, ఇది కొనసాగితే చూపు పోతుందని తండ్రి భయపెట్టాడు. ఆ భయంతో ఆ చిన్నారి టాబ్లెట్ వాడటం మానేశాడు.
ఈ ఘటన నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీసింది. ఒక వర్గం వారు.. నేటి కాలంలో పిల్లలను డిజిటల్ వ్యసనం నుండి కాపాడటానికి ఇలాంటి ‘ప్రేమపూర్వక బెదిరింపులు’ అవసరమని సమర్థిస్తున్నారు. అయితే, మరికొందరు ఇలాంటి అబద్ధాలు మరియు భయపెట్టడం వల్ల పిల్లల లేత మనసులపై లోతైన భయం ఏర్పడుతుందని, భవిష్యత్తులో తల్లిదండ్రులపై నమ్మకం పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
