ఒక ప్రేమికుల జంట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో, ఆ యువతి సిగరెట్, కూల్‌డ్రింక్ కావాలని అడిగింది.
దీంతో పాడుబడిన రోడ్డు పక్కనే ఉన్న ఒక దుకాణానికి వెళ్లి ఇద్దరూ తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు.
వారి మొత్తం బిల్లు రూ. 480 అయింది. డబ్బులు చెల్లించాలని దుకాణదారుడు అడగ్గా, తమ వద్ద నగదు లేదని, ఆన్లైన్ పేమెంట్ చేస్తామని చెబుతూ జీపే (GPay) వివరాలు అడిగి తీసుకున్నారు. అనంతరం డబ్బులు పంపినట్లుగా ఒక నకిలీ ఆన్లైన్ పేమెంట్ స్క్రీన్‌షాట్‌ను వ్యాపారికి చూపించి అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నించారు.
అయితే, అప్రమత్తమైన దుకాణదారుడు వెంటనే తన బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా డబ్బులు జమ కాలేదని గుర్తించాడు. దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన బైక్‌పై ఆ జంటను వెంబడించి అడ్డగించాడు. డబ్బులు రాలేదని చెప్పినప్పటికీ, ఆ జంట అబద్ధాలు చెబుతూ అతనితో వాదనకు దిగింది. చివరకు దుకాణదారుడు 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేయడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply