విజయనగరం జిల్లా ఎస్.కోట (శృంగవరపుకోట) మండలం సీదిపాలెం గ్రామంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
నాగమణికంఠ (16) అనే బాలుడు స్థానిక కళాశాలలో ఒకేషనల్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అతను అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయితో తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను పదేపదే ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అయితే తల్లిదండ్రులు అతనికి నచ్చజెబుతూ.. “నీకింకా చిన్న వయసు, పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది” అని హితవు పలికారు.
తల్లిదండ్రుల సమాధానంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగమణికంఠ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో పెళ్లికి నిరాకరించారన్న కారణంతో ఒక మైనర్ బాలుడు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply