“అయ్యో.. కాపాడండి!” 10 అడుగుల గుంతలో మునిగిపోయిన కారు.. నీటిలో చిక్కుకున్న వారిని సినిమా ఫక్కీలో కాపాడిన 5 గురు స్నేహితులు.. యూపీలో కలకలం!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ప్రాంతంలో, నిఘాసన్-పాలియా హైవేపై వెళ్తున్న ఒక కారు.. ఎదురుగా బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టకుండా తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న 10 అడుగుల లోతైన గుంతలోకి బోల్తా పడింది.

గుంతలో పడిన వెంటనే ఆ కారు వేగంగా నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఐదుగురు స్నేహితులు ఈ ప్రమాదాన్ని చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నీటిలోకి దూకారు.

దేవదూతల్లా రంగంలోకి దిగిన ఆ ఐదుగురు స్నేహితులు.. కారులో చిక్కుకుపోయిన వారందరినీ ప్రాణాపాయం నుండి చాకచక్యంగా కాపాడి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ప్రాణాలను లెక్కచేయకుండా సమయస్ఫూర్తితో స్పందించి అందరినీ కాపాడిన ఆ యువకుల సాహసాన్ని స్థానికులు వేనోళ్ల కొనియాడుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *