“అయ్యో.. కొట్టకండిరా మమ్మల్ని వదిలేయండి!” మహిళలపై కర్కశ దాడి.. చోద్యం చూసిన స్థానికులు.. .!

ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లోని పడార్థ గ్రామం సంత ప్రాంతంలో.. ఇద్దరు మహిళలకు, కొందరు స్థానిక పురుషులకు మధ్య తలెత్తిన వివాదం బాహాటంగా ఘర్షణకు దారితీసింది.

ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడంతో, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రోడ్డు పక్కన జరిగిన ఈ గొడవలో, గుంపులో ఉన్న ఓ వ్యక్తి ఆ ఇద్దరు మహిళలను కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేస్తూ అరాచకం సృష్టించాడు. చుట్టూ పదుల సంఖ్యలో జనం చోద్యం చూస్తున్నారే తప్ప, ఎవరూ అతడిని అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. బహిరంగ ప్రదేశంలో మహిళలపై జరిగిన ఈ అమానుష దాడి ప్రజా భద్రతపై తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని రేకెత్తించింది.

దీనిపై సమాచారం అందించిన పథ్రి పోలీస్ స్టేషన్ అధికారి రవీంద్ర కుమార్.. ఇరు వర్గాల మధ్య ఇప్పటికే పాతకక్షలు ఉన్నాయని, బాధితులైన మహిళలు గతంలోనే పెరుపూర్ పోలీస్ ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా దాడికి పాల్పడిన నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని, దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: