ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో, ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన 17 ఏళ్ల ఒక యువకుడు గేమింగ్ కోసం డబ్బులు సమకూర్చుకోవడానికి తన సొంత కిడ్నాప్ నాటకానికి తెరతీశాడు.
అతడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి, తాను కిడ్నాప్ అయినట్లు నకిలీ ఫోటోలను సృష్టించి తన తండ్రి వాట్సాప్ నంబర్‌కు పంపాడు. అంతేకాకుండా, రూ. 1 లక్ష డబ్బు ఇవ్వకపోతే కొడుకుని చంపేస్తామని ఆ మెసేజ్‌లో బెదిరించాడు.
ఇది చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కాల్ డేటా రికార్డులు, సీసీటీవీ విజువల్స్ ఆధారంగా తీవ్రంగా గాలించి, కేవలం 4 నుండి 5 గంటల వ్యవధిలోనే ఆ కుర్రాడిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అతడు వేసిన కుట్ర ప్లాన్ మొత్తం బయటపడింది.
ఈ ఘటనలో అత్యంత విచిత్రమైన విషయమేమిటంటే, ఆ కుర్రాడికి చేతికి నేరుగా నగదు రూపంలో ఏమీ వద్దు అని చెప్పడమే! “ఆ డబ్బును నా ఆన్‌లైన్ గేమింగ్ అకౌంట్‌లో ‘టాప్-అప్’ చేస్తే చాలు” అని అతడు చాలా తేలికగా చెప్పాడు. ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనంతో ఒక కుర్రాడు సినిమా ఫక్కీలో ఆడిన నాటకానికి పోలీసులు కేవలం కొన్ని గంటల్లోనే తెరదించారు.

Leave a Reply