ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తేమగా ఉన్న రోడ్డులోని ఒక చిన్న సందులో, చిన్న పిల్ల కుక్క ప్రమాదవశాత్తు చిక్కుకుపోయింది.
తారు రోడ్డు సందు నుంచి బయటకు రాలేక ఆ చిన్న జీవి ప్రాణాలతో పోరాడుతుంటే, ఏమి చేయాలో తెలియక తల్లడిల్లిపోయిన తల్లి కుక్క వేదనతో అటు ఇటు తిరిగిన దృశ్యం చూసేవారిని కలచివేసింది.
తన పిల్లను కాపాడుకోలేక తల్లి కుక్క దిగులుతో మూలుగుతుండటం చూసిన ఆ మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తి, వెంటనే సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఆ మంచి మనసున్న మనిషి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న పారను చేతిలోకి తీసుకున్నాడు.
పిల్ల కుక్కకు ఎలాంటి గాయం తగలకూడదనే విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, అతడు పారతో రోడ్డు సందును మెల్లగా పెద్దది చేశాడు. అతని సమయస్ఫూర్తితో కూడిన ప్రయత్నం వల్ల కొన్ని నిమిషాల పోరాటం తర్వాత ఆ పిల్ల కుక్క సురక్షితంగా బయటపడింది.
రోడ్డు నుంచి సురక్షితంగా బయటపడిన పిల్ల కుక్కను చూడగానే, దాని తల్లి పరుగెత్తుకుని వచ్చి నాకి తన ప్రేమనంతటినీ కురిపించింది. ఈ హృదయపూర్వక రెస్క్యూ ఆపరేషన్‌ను వీడియోగా రికార్డు చేసి సోషల్ మీడియాలో పంచుకోగా, అది తక్కువ సమయంలోనే వైరల్‌గా మారి వేలాది లైకులను సొంతం చేసుకుంది.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలువురు, ఆపద సమయంలో చాకచక్యంగా వ్యవహరించి పిల్ల కుక్కను కాపాడిన ఆ వ్యక్తి మానవత్వాన్ని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply