ముంబై విలే పార్లే ప్రాంతంలోని మిథీబాయి కాలేజీ సమీపంలో గల ఎన్.ఎస్. రోడ్డు నంబర్ 1 వద్ద, ఆగస్టు 22 ఉదయం 15 ఏళ్ల బాలిక రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది.
ఆ సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక మోటార్ సైకిల్ ఆ బాలికను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బాలిక గాల్లోకి ఎగిరిపడి తీవ్రంగా గాయపడింది.
ప్రమాదానికి కారణమైన బైక్ నడుపుతున్న వ్యక్తి.. చుట్టుపక్కల వారు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆగకుండా ఘటనా స్థలం నుంచి వేగంగా పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన ఆ బాలికను స్థానికులు రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జూహు పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ పరారీలో ఉన్న బైకర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply