కాన్పూర్‌లోని ఓ ఇంట్లో మహిళ కుర్చీలోనే విగతజీవిగా పడి ఉన్న ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దోపిడీ యత్నంలో భాగంగానే ఆమెను హత్య చేసి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం 5:00 నుంచి 6:00 గంటల మధ్య ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంట్లోని నీళ్ల మోటార్ వేయడానికి వచ్చిన అద్దెదారుడు, బాధితురాలు ఉమా కుష్వాహా కుర్చీలో పడి ఉండటం చూసి ఎన్నిసార్లు పిలిచినా స్పందించకపోవడంతో ఆమె భర్త శివమంగళానికి సమాచారం అందించాడు.
వెంటనే ఇంటికి చేరుకున్న శివమంగళం.. తొలుత తన భార్యకు గుండెపోటు వచ్చిందేమోనని భావించాడు. అయితే ఆమె మెడపై ఉన్న కమిలిన నల్లటి గాయాలను, ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను చూసిన తర్వాత ఇది దోపిడీతో కూడిన హత్య అని గ్రహించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a Reply