అయ్యో పాపం! ప్రేమ వ్యవహారంలో ఇంతటి దారుణమా..?” పెళ్లి చర్చల్లో గొడవ.. ప్రియురాలిపై కత్తితో దాడి చేసి, డాబా పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య.. గుండెల్ని పిండేసే నేపథ్యం..!!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తాను ప్రేమించిన యువతిపై పదునైన ఆయుధంతో దాడి చేసి, ఆపై ఓ భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మహాలక్ష్మి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన చెన్నయ్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో, శనివారం నాడు పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చెన్నయ్య, తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో మహాలక్ష్మి మెడ సహా పలు భాగాలపై కిరాతకంగా దాడి చేశాడు.

దాడి అనంతరం సమీపంలోని ఓ ఇంటి డాబా (టెర్రస్) పైకి పరుగెత్తిన చెన్నయ్య, అక్కడి నుంచి కిందకు దూకి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. తీవ్ర గాయాలపాలైన మహాలక్ష్మిని రక్షించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అజిత్ సింగ్ నగర్ పోలీసులు, పెళ్లి చర్చల్లో తలెత్తిన విభేదాలే ఈ దాడికి కారణమా లేక మరేదైనా సమస్య ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *